హైదరాబాద్ కొండాపూర్ శరత్ సిటీ మాల్‌లో గోఫిజ్జా ఔట్‌లెట్‌ను ప్రారంభించిన సినీ నటి మధుశాలిని
హైదరాబాద్
నూతన సంవత్సర ప్రారంభంతో ప్రారంభమైన గోపిజ్జా ప్రయాణం.
2023 సంవత్సరాంతానికి భారతదేశవ్యాప్తంగా 100కు పైగా ఔట్‌లెట్లను ఏర్పాటుచేయాలనే లక్ష్యం.
హైదరాబాద్, జనవరి , 2023 :
అత్యంత ప్రాచుర్యం పొందిన కొరియన్ హెచ్‌క్యు పిజ్జా బ్రాండ్ గోపిజ్జా.. తమ మొట్టమొదటి స్టోర్‌ను తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఈ ఔట్‌లెట్‌ను హైటెక్ సిటీలోని శరత్ సిటీ మాల్, రెండవ అంతస్తులో ఏర్పాటు చేసిన గో ఫిజ్జా ఔట్‌లెట్‌ను సినీనటి మధుశాలిని ప్రారంభించారు. భారతదేశపు మార్కెట్‌లో వేగంగా విస్తరించాలని ప్రణాళికలు రచించినట్లు గోపిజ్జా ఇండియా సీఈఓ మహేష్ రెడ్డి తెలిపారు. గోపిజ్జా హైదరాబాద్‌లో ఈ ఔట్‌లెట్ ప్రారంభించడం ద్వారా తమ తొలి అడుగుపడిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్ జిల్లా రేగటిపల్లిలో కూడా ఓ ఔట్‌లెట్ ప్రారంభించామన్నారు. గోపిజ్జా ప్రస్తుతం 20 స్టోర్స్ ఏర్పాటు చేస్తున్నామని …2023 సంవత్సరాంతానికి భారతదేశ వ్యాప్తంగా 100 ఔట్‌లెట్‌లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

దక్షిణ కొరియాలో ఈ సంస్ధ ఫౌండర్ జే వోన్ (జే ) లిమ్ యొక్క ఫుడ్ ట్రక్ వద్ద ఓ ఆలోచనలా ప్రారంభమైన ఈ పిజ్జా ఇప్పుడు దక్షిణ కొరియా, సింగపూర్, ఇండోనేషియా, ఇండియా మరియు హాంగ్‌కాంగ్ వరకు వెళ్ళిందని గోపిజ్జా ఇండియా సీఈఓ మహేష్ రెడ్డి తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 200కు పైగా స్టోర్లతో ఎక్కువ మంది అభిమానించే పిజ్జా బ్రాండ్‌గా గో ఫిజ్జా నిలిచిందన్నారు.
ఇటీవలనే సిరీస్ సీ ఫండింగ్‌లో భాగంగా 200 కోట్ల రూపాయలను ఇది సమీకరించామని… గోపిజ్జా ఇప్పుడు అత్యాధునిక ఫుడ్ సాంకేతికతను ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్‌లలో తీసుకువస్తున్నామని తెలిపారు. పూనె, చెన్నై, ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, కోల్‌కతా, ఇతర టియర్ 2 నగరాలైన చండీఘడ్, జోధ్‌పూర్, జైపూర్, కొచి లలో రాబోయే కొద్ది సంవత్సరాలలో విస్తరించనున్నామన్నారు. అంతర్జాతీయంగా, సింగపూర్ మరియు దక్షిణ కొరియాలలో విజయవంతంగా ప్రోత్సహించబడటంతో గోపిజ్జా ఇప్పుడు థాయ్‌ల్యాండ్, మలేషియా, వియాత్నాం మరియు యునైటెడ్ స్టేట్స్‌లోని కొత్త మార్కెట్‌లకు విస్తరించడానికి ఉన్న అవకాశాలను చూస్తోంది.