సౌత్ ఇండియన్ బ్యూటీస్‌తో రూపొందించిన మై సౌత్ దివా క్యాలెండర్‌ను ఆవిష్కరించిన సినీ నటుడు విశ్వక్ సేన్

హైదరాబాద్

సౌత్ ఇండియన్ బ్యూటీస్‌తో పాటు తమ లాంటి హాండ్‌సమ్ హీరోలతో సైతం మై సౌత్ దివా క్యాలెండర్‌ను రూపొందిస్తే మరింత అందంగా ఉంటుందని సినీనటుడు విశ్వక్ సేన్ అన్నారు .

హైదరాబాద్ ఫిలింనగర్‌ రామానాయుడు స్టూడియోలో ప్రముఖ ఫోటోగ్రాఫర్ ,క్యూరేటర్‌ మనోజ్ కుమార్ కటోకర్‌ తీసిన క్యాలెండర్ చిత్రాలు ఎంతో చక్కగా వచ్చాయని విశ్వక్ సేన్ అన్నారు . వచ్చే ఏడాది తమ లాంటి సౌత్ ఇండియన్ హీరోలకు సైతం మై సౌత్ దివా క్యాలెండర్‌లో అవకాశం కల్పించాలని కోరారు .ఈ కార్యక్రమంలో నటీమణులు అవికా గోర్, మాళవిక శర్మ, హర్షిత గౌర్, ఉల్కా గుప్తా,సిమ్రాన్ శర్మ తదితరులు పాల్గొన్నారు .


మై మిస్ దివా క్యాలెండర్‌లో భారతి సిమెంట్ సంస్థ అసోసియేట్ కావడం తమకెంతో సంతోషంగా ఉందని భారతీ సిమెంట్స్ డీఎం రవీంద్ర రెడ్డి అన్నారు . మై సౌత్ దివా క్యాలెండర్‌లో 12 మంది సౌత్ సినిమా బ్యూటీస్ ఉన్నారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *