రూ.1,571 కోట్లతో నిమ్స్ విస్తరణ
కొత్తగా అందుబాటులోకి 2 వేల ఆక్సిజన్ పడకలు
హైదరాబాద్ : హైదరాబాద్‌లో నిమ్స్ ఆసుపత్రిని భారీ స్థాయిలో విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మరో మరో ఆసుపత్రి భవనాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికోసం అవసరమైన నిధులను బ్యాంకుల నుంచి రుణంగా పొందేందుకు సమ్మతించింది.ఈ నూతన ఆసుపత్రి నిర్మాణంతో నిమ్స్‌లో అందుబాటులో ఉన్న 1,800 పడకలకు అదనంగా మరో 2వేలు అందుబాటులోకి రానున్నాయి