ఏకమ్ విశ్వశాంతి ఉత్సవంను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలి : రిటైర్డ్ డి జి MV కృష్ణారావు

హైదరాబాద్, బంజారాహిల్స్

ఏకమ్ క్షేత్రం కేంద్రంగా శ్రీ ప్రీతాజి శ్రీ క్రిష్ణజి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 నుండి 19 వరకు జరగనున్న విశ్వ శాంతి ఉత్సవంను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని రిటైర్డ్ డీజీ ఎం వి కృష్ణా రావు పిలుపునిచ్చారు . ప్రపంచంలోని అతి పెద్ద పీస్ మెడిటేషన్ ఫెస్టివల్ ఆన్‌లైన్ లో జరుగనుందన్నారు.

ఏకమ్ వరల్డ్ పీస్ ఫెస్టివల్ ను ప్రపంచంలోని 100 దేశాలలో 3 సంవత్సరాలుగా జరుపుకుంటున్నారని..ఈ ఏడాది జరిగే ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. శాంతియుతంగా జీవించడానికి వారి సహజ సిద్దమయిన సామర్థ్యాన్ని మానవాలి కి గుర్తు చేయడమే ఏకం అని సహవ్యవస్థాపకులైన శ్రీ ప్రీతజీ ,శ్రీ కృష్ణాజీల లక్ష్యము గా కొనసాగుతుందన్నారు. ఈ peace festival lo ఒక వ్యక్తి తన ఆత్మలోకి లోతుగా ఎలా చేరుకొగలరు… విశ్వ చైతన్యం తో ఎలా కనెక్ట్ అవ్వాలనే దానిపై తమ జ్ఞానాన్ని శ్రీ ప్రీతాజీ శ్రీ krishnaji అందిస్తారు.

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని హోటల్ తాజ్ బంజారా లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రిటైర్డ్ డి జి MV కృష్ణారావు, MLC బొగ్గరపు దయానంద, తెలంగాణ టూరిజం చైర్మన్ శ్రీనివాస్ గుప్తా,ఏకమ్ మిత్రాస్ కలసి ఏకమ్ వరల్డ్ పీస్ ఫెస్టివల్ 2021 బ్రోచర్ ను ఆవిష్కరించారు..

ఏకమ్ క్షేత్రా సంస్థ నిర్వహకులు మాట్లాడుతూ ప్రపంచ శాంతి ఉత్సవం మతాలకి అతీతం అయినదన్నారు. శాంతి తీసుకురావడానికి వ్యక్తుల చైతన్యాన్ని ప్రభావితం చేయడం ఏకామ్ వరల్డ్ పీస్ ఫెస్టివల్ లక్ష్యమన్నారు .ఇది సంపూర్ణ మానవాళి ని ప్రభావితం చేసే ధ్యానొత్సవం. ఈ సంవత్సరం (2021), 4 వ వార్షిక ఏకమ్ వరల్డ్ పీస్ ఫెస్టివల్ సెప్టెంబర్ 17 నుండి 19 వరకు ‘ఏకమ్’ అనే పవిత్ర స్థలంలో జరుగుతుందని వారు ప్రకటించారు. శ్రీ ప్రీతాజీ, శ్రీ కృష్ణాజీ నిర్వహించే ఈ ఉత్సవం చరిత్రలో అతిపెద్ద ధ్యాన సమావేశాలలో ఒకటిగా నిరూపించబడింది. వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు ఉత్సవంలో పాల్గొని ప్రపంచ శాంతి కోసం ధ్యానం ఆన్ లైన్ లో చేయబోతున్నారని తెలిపారు.

ప్రతి రోజు కొన్ని వేల మంది వ్యక్తులు కుటుంబాలు, వ్యాపార సంస్థలు , విద్యా సంస్థలు శ్రీ ప్రీతజి శ్రీ కృష్ణ జీ తో కలిసి ఈ ఈవెంట్ ను విజయవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వారు తెలిపారు. ఈ ఉచిత ఆన్‌లైన్ ఏకం world peace festivallo సమిష్టిగా ధ్యానం చేయడానికి మీకు స్వాగతం పలుకుతుందని తెలిపారు.శ్రీ ప్రీతాజీ ,శ్రీ కృష్ణాజీ ఉత్సవ సమయంలో ప్రతిరోజూ, 55 నిమిషాలు శాంతి జ్ఞానం , ధ్యానాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

ఈ ఉచిత ఆన్‌లైన్ 55 నిమిషాల ఈవెంట్ ప్రపంచంలోని ఎక్కడి నుండైనా https://www.youtube.com/pkconsciousness/live లో సమిష్టిగా పాల్గొనడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది

సెప్టెంబర్ 17 న ఆర్థిక అశాంతి తోలగడానికి
September 18 na విభజన తోలగడానికి
September 19 na భూమండలం ఉపశమనం పొంది శాంతి కలగాలని ధ్యానం చేస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *