ప్రతి ఒక్కరూ దేశ భక్తిని పెంపొందించుకోవాలి : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్
శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆల్విన్ x రోడ్ బీజేపీ కార్యాలయం వద్ద స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని బిజెపి నాయకులతో కలసి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ జాతీయ జెండాను ఎగురవేశారు.ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈ రోజు మన దేశం యొక్క 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు, స్వతంత్ర దేశాన్ని నిర్మించడానికి లెక్కలేనన్ని త్యాగాలకు మా ధైర్య స్వాతంత్ర్య సమరయోధులకు నా నివాళులు అర్పిస్తున్నాను అని అన్నారు.ఈ దేశభక్తులకు మనం చెల్లించగల అత్యంత అర్ధవంతమైన నివాళి ఏమిటంటే, వారు కలలుగన్న భారతదేశాన్ని నిర్మించడం-పేదరికం, నిరక్షరాస్యత, పట్టణ-గ్రామీణ విభజన, కుల మరియు లింగ వివక్ష లేని భారతదేశం అని అన్నారు.ఈ స్వాతంత్ర్య దినోత్సవం రోజున, ఒక బిలియన్ ప్లస్ కలలు వారి వ్యక్తీకరణ మరియు నెరవేర్పును కనుగొనే బలమైన, సంపన్నమైన, సమగ్రమైన మరియు ప్రశాంతమైన దేశాన్ని నిర్మించాలనే మా నిబద్ధతను పునరుద్ధరించుకుందాం అని అన్నారు.బ్రిటీష్ పరిపాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేందుకు జరిగిన అనేకమైన పోరాటాల్లో ఎందరో దేశభక్తులు పాల్గొన్నారు అని అన్నారు. ప్రపంచ రాజకీయాల నేపథ్యంలోనూ, భారతీయ స్వాతంత్ర్య పోరాటాల ఫలంగానూ దేశానికి 1947 ఆగస్టు 14న అర్థరాత్రి సమయంలో స్వాతంత్ర్యం వచ్చింది అని అన్నారు.కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటి, ఆ మహాత్ముడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు అని అన్నారు. సత్యాగ్రహమూ, అహింస పాటించడానికి ఎంతో ధైర్యము కావాలని బోధించాడు అని అన్నారు. మహాత్ముడనీ, జాతిపిత అనీ పేరెన్నిక గన్న గాంధీజీని స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా స్మరించుకుందాం అని అన్నారు.ప్రపంచంలోనే భారతదేశం అగ్ర దేశంగా తీర్చిదిద్దాడంలో అదే ఉద్యమ స్పూర్తితో పనిచేద్దాం అని అన్నారు.తదనంతరం పలు ప్రాంతాల్లో జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు బుచ్చిరెడ్డి, మనోహర్, శ్రీధర్ రావు, మణిక్ రావు,రాంరెడ్డి, రవి గౌడ్, స్వాతి, కోటేశ్వరరావు, నారాయణరెడ్డి, బాబు రెడ్డి, లక్ష్మణ్, కళ్యాణ్, రామకృష్ణ,పృథ్వి కాంత్,పవన్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.