ప్రతి ఒక్కరూ సంస్కృతి సంప్రదాయాలను,దేశ భక్తిని అలవర్చుకోవాలి : భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్ జ్ఞానేంద్ర ప్రసాద్
హైదరాబాద్
శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గంగారాం, మియాపూర్, హఫీజ్ పేట్, ప్రశాంత్ నగర్ ,కూకట్ పల్లి చెరువులను, వినాయక నిమజ్జనం కొనేరులను భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్ జ్ఞానేంద్ర ప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈ ఉత్సవాల్లో యువకులు పెద్ద ఎత్తున పాల్గొనడం సంతోషదాయకమని అన్నారు.రోజురోజుకు దైవభక్తి పెరుగుతుంది అని అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద పండుగ ఇది అని అన్నారు.ఆనాడు స్వాతంత్ర్య సమరయోధులు బాల గంగాధర్ తిలక్ ప్రతిఒక్కరిని యువకులను ఒకే దాటిలో ఐక్యం పెంచేందుకు అటు సంస్కృతి సంప్రదాయాను , దేశ భక్తి పెంచేందుకు ఈ ఉత్సవాలను నిర్వహించారని కొనియాడారు.అన్ని మండపాల నిర్వాహకులు, యువకులు ముఖ్యంగా చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొని భగవంతుని ఆశీర్వాదాలు తీసుకునందుకు సంతోషిస్తూ ప్రతి ఒక్క మండపాల నిర్వాహకులకు,అధికారులకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.అలాగే వచ్చే ఏడాది ఇంకా మెరుగైన చెరువులను ఏర్పాటు చేసి ఈ పండుగను ఇంకా పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించుకోవాలని కోరారు.