ఉద్యోగులు చ‌ర్చ‌ల ద్వారా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోవాలి :ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్​ శర్మ

ఉద్యోగుల ఆందోళనలు, ధర్నాలు, సమ్మెల వల్ల ఏమీ రాదని.. చర్చిస్తేనే సమస్యలు పరిష్కారమయ్యేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్​ శర్మ స్పష్టం చేశారు. ఉద్యోగులకు సమస్యలున్న మాట నిజమేనని.. అయితే చర్చించి వాటిని పరిష్కరించుకోవాలని సీఎస్​ సూచించారు. పాత పీఆర్‌సీతో కొత్త పీఆర్‌సీని పోల్చి చూడాలని.. పే స్లిప్‌లో అన్ని విషయాలు చూస్తే జీతం పెరిగిందన్నారు. సమ్మెకు వెళ్లడం వల్ల అనేక ఇబ్బందులు వస్తాయన్న సీఎస్​.. ఉద్యోగ సంఘాలతో మాట్లాడేందుకు మేం ఎప్పుడూ సిద్ధమేనని​ స్పష్టం చేశారు.

కొత్త పీఆర్‌సీ వల్ల ఎవరి జీతం కూడా తగ్గలేద‌ని… పాత పీఆర్‌సీతో కొత్త పీఆర్‌సీని పోల్చి చూడాల‌న్నారు. పే స్లిప్‌లో 10 రకాల అంశాలు ఉంటాయని.. అన్నీ సరిచూడాల‌న్నారు. 11వ పీఆర్‌సీలో 27 శాతం ఐఆర్‌ను 30 నెలలపాటు ఇచ్చామ‌ని.. ఉద్యోగులకు ఐఆర్ రూపంలో రూ.18 వేల కోట్లు ఇచ్చామ‌న్నారు. . సమ్మెకు వెళ్లడం వల్ల అనేక ఇబ్బందులు వస్తాయని స‌మీర్ శ‌ర్మ స్ప‌ష్టం చేశారు .ఉద్యోగ సంఘాలు చర్చలకు రావాలని కోరారు. కరోనా వల్ల అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని.. రెండున్నర ఏళ్లుగా మధ్యంతర భృతి ఇస్తున్నామ‌న్నారు. మధ్యంతర భృతి అనేదాన్ని ఎక్కడో ఒకచోట సర్దుబాటు చేయాలని… అయినా.. తెలంగాణలా మేం డీఏ ఇవ్వలేదని.. ఐఆర్ ఇచ్చామ‌న్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *