టీఆర్‌ఎస్ నేత రాజనాల శ్రీహరి కి ఎన్నికల కమిషన్ నోటీసులు
వరంగల్ :
టీఆర్ఎస్ నేత, మాజీ సాప్ డైరక్టర్ రాజనాల శ్రీహరి కి ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. దసరాకు ముందు రోజు స్థానిక హమాలీలకు రాజనాల శ్రీహరి మద్యం, కోళ్లు పంపిణీ చేశారు. కేసీఆర్ కొత్తపార్టీ పెట్టబోతున్న సందర్భంగా మద్యం పంపిణీ చేసినట్టు వెల్లడించారు. కేసీఆర్ , కేటీఆర్ భారీ కటౌట్ల ముందే శ్రీహరి మద్యం పంపిణీ చేశారు. ఈ వ్యవహారంపై సామజిక మాధ్యమాల్లో వరుస కథనాలు ప్రసారం అయ్యాయి. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా మద్యం పంపిణీ చేస్తున్నారంటూ ఈసీకి స్థానికులు ఫిర్యాదు చేశారు. కథనాలు, స్థానికుల ఫిర్యాదుపై స్పందించి ఈసీ శ్రీహరి మందు పంపిణీకి సంబంధించి వివరణ ఇవ్వాలని వరంగల్ కలెక్టర్‌ను కోరింది. అలాగే రాజనాల శ్రీహరికి నోటీసులు జారీ చేసింది. కాగా దీని వెనుక వరంగల్ కు సంబందించిన సొంత పార్టీ నేతల హస్తం ఉన్నదనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది.