చిన్నారులు మానసికంగా , శారీరకంగా బలంగా ఉండేందుకు ఆటా పాటలతో కూడిన విద్య అవసరం:డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి
సికింద్రాబాద్ ,తార్నాక
చిన్నారులు మొబైల్ గేమ్స్ అన్ లైన్ గేమ్ లకు బానిసలు అవుతున్న జీవితాలను నాశనం చేసుకుంటున్నారని డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు .
హైదరాబాద్ తార్నాకలో నూతనంగా ఏర్పాటు చేసిన సిమ్ అండ్ సామ్ ప్లే టౌన్ జోన్ ఐదవ శాఖను ఆమె ప్రారంభించారు .
హైదరాబాద్ తార్నాకలో ఏర్పాటు చేసిన సిమ్ సామ్ ప్లే టౌన్ సర్కస్ థీమ్ తో ఏర్పాటు చేశామని ఎండీ సుమిత్ అహుజా తెలిపారు .కొత్త కాన్సెఫ్ట్ తో ఏర్పాటు చేసిన సర్కస్ థీమ్ ప్లే టౌన్ లో చిన్నారులతో పాటు తల్లిదండ్రుల హృదయాలను గెలుచుకుంటుందని ఆయన తెలిపారు.
ఈ ప్లే టౌన్ ప్రారంభ సందర్భంగా శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ రోజుల్లో పిల్లలు మొబైల్, ఆన్ లైన్ ఆటలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు . పిల్లలకు సరైన ఆట మైదానాలు లేవని ..కరోనా కారణంగా పిల్లలందరూ ఇంట్లో మొబైల్ ఫోన్లకు అతుక్కుపోయారని చెప్పారు . ఈ పరిస్థితిలో సిమ్ అండ్ సామ్ సంస్థ గాడ్జెట్ ఫ్రీ ప్లే స్టేషన్లు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు .పిల్లలు శారీరక ఆటలు ఆడటం ద్వార శారీరకంగా మానసికంగా బలంగా ఉంటారని ఆమె తెలిపారు . తార్నాక లో ఇటువంటి ప్లేటౌన్ ఉండటం తమకు సంతోషంగా ఉందని ఆమె అన్నారు.
సిమ్ అండ్ సామ్ 100% గాడ్జెట్ ఫ్రీ ప్లే జోన్ అని సిమ్ అండ్ సామ్ ఎండి సుమిత్ అహుజా అన్నారు . ఈ కొత్త బ్రాంచ్ లో ట్రాంపోపోలిన్స్, నెట్ క్రికెట్, స్టిక్కీ వాల్, టార్జాన్ స్వింగ్స్, డోనట్ స్లైడ్స్, రౌండ్-క్లైంబింగ్ టవర్, మంకీ బ్రిడ్జ్ ,సర్కస్ థీమ్ పార్టీ హాల్ తో పాటు స్పైరల్ స్లైడ్లు ఉన్నాయని ఆయన చెప్పారు. క్లైంబ్ ది జోకర్, జిప్పింగ్ ఫాస్ట్ సర్కస్ స్లైడ్, రోలింగ్ ఛైయిర్స్, బ్రెయిన్ టీజింగ్ వాల్ గేమ్స్ కూడా అందులో భాగమని ఆయన చెప్పారు.
ఫన్ పార్క్ సిమ్ అండ్ సామ్ ప్రతిరోజూ ఉదయం 11 నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుందని తెలిపారు . పిల్లల ఆరోగ్యం , ఫిట్ నెస్ దృష్టిలో ఉంచుకొని ఇక్కడ గాడ్జెట్ రహిత వాతావరణం కల్పించామని పిల్లలు సరదా ఆటలతో ఆనందాన్ని పెంచుతాయన్నారు.
“భవిష్యత్ సవాళ్లను స్వీకరించడానికి ఆరోగ్యకరమైన , శారీరకంగా బలమైన తరాన్ని తీసుకురావడమే తమ లక్ష్యమని ఎండీ సుమిత్ అహుజా అన్నారు .ఈ కార్యక్రమంలో టిటియుసి స్టేట్ ప్రెసిడెంట్ మోతే శోభన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.