డబ్ల్యుడబ్ల్యుఎఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఎకో విన్నర్స్ సమావేశం
హైదరాబాద్, జనవరి 19, 2023:
డబ్ల్యుడబ్ల్యుఎఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన యువతలో నాయకత్వం,కార్యచరణపై నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్లలలో అస్సాం, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, కేరళ, తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చిన ఆరుగురు ఎంపిక అయినట్లు డబ్ల్యుడబ్ల్యుఎఫ్ ఇండియా ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రాధిక సురి తెలిపారు.

హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ఎకో విన్నర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం జనవరి 18, 19 తేదీల్లో జరిగిందన్నారు. యువత నాయకత్వం, కార్యాచరణపై ఇంటరాక్టివ్ సెషన్ల నిర్వహించామని తెలిపారు. అమీన్ పూర్ చిత్తడి నేలలు, మహావీర్ హరిణ వనస్థలి జాతీయ ఉద్యానవనం సందర్శనతో పాటు, హైదరాబాద్ నగరంలోని చారిత్రక ప్రాంతాల్లో పర్యటించారని వివరించారు.

ఈ కార్యక్రమంలో డబ్ల్యుడబ్ల్యుఎఫ్ ఇండియా ఎకో యూత్ అంబాసిడర్ దీప్షికా యదుగిరి మాట్లాడుతూ యువత సామర్థ్యాన్ని పెంపొందించడం అనేది కొత్త ఆలోచనలను ప్రాసెస్ చేయడానికి మాత్రమే కాదని, భవిష్యత్తులో నాయకులను బాధ్యతలు స్వీకరించేలా సిద్ధం చేయడానికి చేసే ప్రయత్నమన్నారు.
ఎకో – ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ హీరోస్ అనేది దేశవ్యాప్తంగా యువతను ఎంగేజ్ చేసే కార్యక్రమం అని … ఇది విశ్వవిద్యాలయ విద్యార్థులు హరిత పారిశ్రామికవేత్తలుగా మారడానికి అవకాశాన్ని అందిస్తుందన్నారు. 2018లో కేవలం నాలుగు నగరాలు, 20 కళాశాలలతో ప్రారంభమైన ఈ కార్యక్రమం క్రమంగా.. దేశవ్యాప్తంగా యువత నేతృత్వంలోని కార్యక్రమంగా అభివృద్ధి చెందిందని రాధిక సురి తెలిపారు. కళలు, సైన్స్, ఇంజనీరింగ్, వైద్య సంస్థలు, మేనేజ్మెంట్, లా.. ఇలాంటి విభిన్న విద్యా నేపథ్యాలకు చెందిన యువత ఆసక్తులను ఆకర్షిస్తుందన్నారు. 2022 నాటికి ఎకో పది రాష్ట్రాలు, 78 సంస్థలకు విస్తరించిందన్నారు.