తెలంగాణ ఉద్యమ సమయంలో ,తెలంగాణ స్వయం పాలనలో యువత పాత్ర గొప్పది :సీఎం కేసీఆర్

అంతర్జాతీయ యువజన దినోత్సవం (12 ఆగస్టు) పురస్కరించుకుని తెలంగాణ యువతకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమంతో పాటు తెలంగాణ స్వయం పాలనలో యువత పాత్ర గొప్పదని సిఎం అన్నారు. తెలంగాణ ఏర్పాటుతో రాజకీయ, పాలనా రంగాల్లో విద్యార్థి యువనేతలకు చట్టసభల్లో పెద్దఎత్తున అవకాశాలు కల్పించి బడుగు బలహీన వర్గాల యువతను ప్రోత్సహిస్తున్నామని సిఎం అన్నారు. ఈ ప్రక్రియ మునుముందు కూడా కొనసాగుతుందని తెలిపారు.

యువత భవిష్యత్తును దృష్టిలో వుంచుకుని వారి ఉద్యోగ,ఉపాధి అవకాశాలు మరింతగా మెరుగుపడే దిశగా వ్యవసాయం, పరిశ్రమలు, ఐటి వంటి రంగాలను తెలంగాణ ప్రభుత్వం తీర్చిదిద్దుతున్నదని సిఎం అన్నారు. ఉపాధికి అవకాశమున్న టూరిజం,లాజిస్టిక్స్ వంటి వినూత్న మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తున్నదన్నారు. స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం పలు పథకాల ద్వారా ఆర్థికంగా సాయం అందిస్తున్నదన్నారు. శాస్త్రీయ పద్ధతిలో జోనల్ విధానాన్ని అమలులోకి తెచ్చుకుని ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు మార్గం విస్తృతం చేసుకున్నామన్నారు. వినూత్న పథకాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడం ద్వారా యువత ఉపాధికి బాటలు మెరుగవుతున్నాయని సిఎం తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణలో యువత పాత్ర అన్ని రంగాల్లో మరింత కీలకం కాబోతున్నదన్నారు. భవిష్యత్ తెలంగాణ యువతదేనని సిఎం కెసిఆర్ తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *