అవినీతి రహిత సమాజ నిర్మాణంలో ప్రజలంతా భాగస్వాములు కావాలి డాక్టర్ షేక్ రసూల్
దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరిగిపోతున్న అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ప్రతిఒక్కరు సామాజిక బాధ్యతతో పనిచేయాలని నేషనల్ యాంటీ కరప్షన్ అండ్ ఆపరేషన్ కమిటీఆఫ్ ఇండియా సౌత్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ షేక్ రసూల్ పిలుపునిచ్చారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని కార్యాలయంలో ఏపీ,తెలంగాణ, కర్నాటక రాష్టాలకు చెందిన నేషనల్ యాంటీ కరప్షన్ అపరేషన్ కమిటీ ఆప్ ఇండియా కమిటీల సభ్యులకు సంస్థ నేషనల్ ఛైర్మన్ డాక్టర్ రాకేష్ శుక్ల నియామక పత్రాలను అందజేశారు. అవినీతి రహిత సమాజం కోసం ప్రజలను భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎంపిక చేసిన సభ్యులకు నియామకం పత్రాలతో పాటు గుర్తింపు కార్డులను అందజేసి సత్కరిoచి శుభాకాంక్షలు తెలియజేశారు. డాక్టర్.రసూల్ మాట్లాడుతూ అన్ని రంగాలలో చోటుచేసుకుంటున్న అవినీతి కారణంగా ప్రజల జీవన ప్రమానాలు రోజురోజుకు మరింతగా దిగజారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు .వివిధ రంగాలలో అస్థిరత పెరిగిపోతోందన్నారు. అవినీతి పెరిగిపోతుండడంవల్ల నేరాలు కూడా పెరుగుతుంటాయని,ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు. అవినీతిని అడ్డుకునేందుకు సంస్థలో నియమితులైన ప్రతిఒక్కరు స్వచ్చందంగా బాధ్యతాయుతంగా పనిచేయాలని,ప్రజలను చైతన్య పరచాలని రసూల్ సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ తెలంగాణ అధ్యక్షుడు కె.సత్యనారాయణ, ఉపాధ్యక్షులు సంగారెడ్డి, జి. నరసింగరావు, మహా జబీన్ మజీద్ ఖాన్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ ఇంచార్జి జోగిబాబు, తెలంగాణ మీడియా సెక్రెటరీ పి.ప్రకాష్, హెల్త్ ప్రొటెక్షన్ ఇంచార్జి డాని రత్నాకర్, సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.నవీన్ కుమార్, శ్రీనివాసరావు, చిన్నరసూల్, అజ్జు,రమణ,అశోక్ రాజ్, రాజు తదితరులు పాల్గొన్నారు.