హైదరాబాద్ మెహదీపట్నం లో జాగ్వర్ బాత్ అండ్ లైట్ సొల్యూషన్స్ షోరూంను ప్రారంభించిన సూర్య ఇంటర్నేషనల్ చైర్మన్ డాక్టర్ హరినాథ్ బాబు

హైదరాబాద్ ,మెహదీపట్నం

ఇంటికి ఇంటీరియర్స్ అదనపు అందాలను తెచ్చిపెడతాయి. ఇంటీరియర్స్ తో పాటు శానిటరీవేర్, లైటింగ్ విషయంలో ప్రతి ఒక్కరు ప్రత్యేకతను కోరుకుంటారు. అలాంటి వారి కోసం ప్రపంచంలోనే ప్రముఖ బ్రాండ్ జాక్వార్ మరో కొత్త షోరూంను ప్రారంభించింది. హైదరాబాద్ మోహదీపట్నం ఫిల్లర్ నెంబర్ 44 వద్ద రెయిన్ బో శానిటేషన్ షోరూంలో జాక్వార్ ఉత్పత్తులు అందుబాటులో ఉంచింది.

ఇటీవల కాలంలో ఇళ్ళు, అపార్ట్ మెంట్లు , వాణిజ్య భవనాలు, ఐటీ రంగ పరిశ్రమలు గ్రీన్ బిల్డింగ్ లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి.గ్రీనరికి అధిక ప్రాధాన్యత ఇస్తూ నిర్మాణాల సంఖ్య పెరిగింది. ప్రజల ఆధునిక అవసరాలను తీర్చేందుకు జాక్వార్ బాత్ అండ్ లైట్ సొల్యూషన్స్ సంస్థ కొత్త బాత్ ఉత్పత్తులను తీసుకువచ్చింది. ఈ షోరూంలో జాక్వార్ బాత్ అండ్ లైట్ సొల్యూషన్స్ కు చెందిన శానిటరీ వేర్ ,బాత్రూం ఉపకరణాలు, వాటర్ హీటర్లు, షవర్ ఎన్ క్లోజర్లు, స్పా, వెల్ నెస్, లైటింగ్ వంటి జాక్వార్ ఉత్పత్తులను అందుబాటులో ఉంచారు.

హైదరాబాద్ మోహదీపట్నం ఫిల్లర్ నెంబర్ 44 రైతిబౌలిలో రెయిన్ బో శానిటేషన్ షోరూంను సూర్య ఇంటర్నేషనల్ అధినేత పెండ్యాల హరినాథ్ బాబు ప్రారంభించారు. అనంతరం జాక్వార్ లైటింగ్ డివిజన్ ను జాక్వార్ ఏపీ,తెలంగాణ బ్రాంచ్ హెడ్ దాసరి సీతారాం ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవంలో తెలంగాణ రిటైల్ హెడ్ కె.చంద్రశేఖర్ ,సూర్య ఇంటర్నేషనల్ మేనేజర్ నవీన్ పాల్గొన్నారు .

ఈ సందర్భంగా పెండ్యాల హరినాథ్ బాబు మాట్లాడుతూ…దేశంలోని ప్రముఖ నగరాలతో పాటు ఏపీ,తెలంగాణలో జాక్వార్ బాత్ అండ్ లైట్ షోరూంలను మరింత విస్తరిస్తున్నామని తెలిపారు. మోహదీపట్నంలో నూతనంగా ప్రారంభించిన ఈ షోరూం… తమ 17 వ షోరూం అన్నారు. జాక్వార్ బాత్ అండ్ లైట్ సొల్యూషన్స్ నుంచి ప్రీమియం ఉత్పత్తులను అందిస్తున్నామని… ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందన్నారు. అర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైనర్స్ ఫ్యామిలీతో వచ్చే కస్టమర్లకు విశాలమైన ప్రాంగణంలో ఈ షోరూం తీర్చిదిద్దారు.

రెయిన్ బో శానిటేషన్ షోరూం ఎండీ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ …తాము జాక్వార్ బాత్ అండ్ లైట్ సొల్యూషన్స్ సంస్థతో గత 20 సంవత్సరాలుగా అసోసియేట్ అయ్యామని… ప్రీమియర్ ఉత్పత్తులను అందిస్తున్న ఈ బ్రాండ్ కు కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *