హైదరాబాద్ ఆలివ్ హాస్పటల్ లోని ఆంకో క్యాన్సర్ సెంటర్ లో అసాధారణ బ్లడ్ క్యాన్సర్ పేషంట్ కు ఉపశమనం కల్గించిన వైద్యులు
అసాధారణ బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఓ పేషంట్ కు పునఃజన్మ ప్రసాదించారు ఆలివ్ హాస్పిటల్ లోని ఆంకో క్యాన్సర్ సెంటర్ వైద్యులు .హైదరాబాద్ మెహదీపట్నంలోని ఆలివ్ హాస్పటల్ లో ని ఆంకో క్యాన్సర్ సెంటర్ కు వచ్చిన ఓ మహిళ స్థితిని పరిశీలించి అక్యూట్ లింపోబ్లాస్టిక్ ల్యుకేమియాతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఆమెను ఎలాగైన బ్రతికించాలని చివరి ప్రయత్నంగా ఆసుపత్రికి తీసుకువచ్చారని వైద్యులు శిఖర్ కుమార్ తెలిపారు .
ఈ మహిళకు అసాధారణ బ్లడ్ క్యాన్సర్ వచ్చిందని..ఈ క్యాన్సర్ తెల్లరక్తకణాలపై అత్యధికంగా ప్రభావం చూపుతుందని గుర్తించామన్నారు. అత్యుత్తమ మైన చికిత్స అందిస్తే ఆమె జీవించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయాన్ని రోగి కుటుంబసభ్యులకు తెలుపగా …వారు చికిత్సకు అంగీకరించారని డాక్టర్ శిఖర్ కుమార్ తెలిపారు. ఆరు నెలల కిమో థెరిఫీ, ఐవీ కిమో థెరిఫీ చికిత్సను చేశామని..ఇంటి వద్ద మాత్రలు తీసుకున్నారని తెలిపారు. రోగి నమ్మకంతో చికిత్స చేయించుకుందని.. తాజాగా చేసిన వైద్య పరీక్షల్లో ఆమెకు ఎంఆర్డీ టెస్ట్ నెగిటివ్ గా వచ్చిందన్నారు. సుదీర్ఘ కాలం పాటు ఉన్న క్యాన్సర్ రోగి తిరిగి కోలుకుందని …సాధారణ పనులసైతం చేసుకుంటుందని వివరించారు. ఆలివ్ ఆసుపత్రిలోని ఆంకో క్యాన్సర్ సెంటర్ ద్వారా ఈ చికిత్సను విజయవంతం చేశామని వైద్యులు వెల్లడించారు .అసాధారణ రక్త క్యాన్సర్ ఉన్న ఈ పెషెంట్ కోలుకోవడం పట్ల కుటుంబ సభ్యులు , బంధువులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు .