ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఖోఖో క్రీడాకారులకు కిట్లు పంపిణీ
హైదరాబాద్
ఒరిస్సా లోని భువనేశ్వరంలో జరిగే 40 వ జాతీయ జూనియర్ ఖోఖో పోటీలలో పాల్గొనే బాలబాలికల జట్ల క్రీడాకారులకు ఉప్పల ఫౌండేషన్ ఛైర్మెన్ , తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త కిట్లు అందజేశారు.
హైదరాబాద్ నాగోల్ లోని ఉప్పల శ్రీనివాస్ నివాసంలో క్రీడాకారులు కు ఖోఖో కిట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత క్రీడ అయిన ఖోఖో ను గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఖోఖో క్రీడాకారులను ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది అని, క్రీడలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. భవిష్యత్తు లో కూడా క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిస్తామని అన్నారు.
ఒరిస్సా లోని భువనేశ్వర్ లో జరిగే 40 వ జాతీయ జూనియర్ ఖోఖో పోటీలలో పాల్గొనే బాలబాలికలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ క్రీడాకారులు పథకాలు సాధించి తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఖోఖో సంఘం ప్రధాన కార్యదర్శి కోట్ల రామకృష్ణ, శ్రీనివాస్ మరియు బాల బాలికల జట్ల క్రీడాకారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.