నెల్లూరు జిల్లా కందుకూరు చంద్రబాబు సభలో అపశృతి
తొక్కిసలాటతో కాలువలో పడి ఏడు గురు మృతి
టిడిపి అధినేత అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్న నెల్లూరు జిల్లా కందుకూరు సభలో అపశృతి చోటు చేసుకుంది.

కార్యకర్తలు భారీగా తరలి రావడంతో తోపులాట జరిగి కొందరు కార్యకర్తలు డ్రైనేజీలో పడిపోయారు. అప్రమత్తమైన తెదేపా నేతలు గాయపడిన కార్యకర్తలను వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఏడుగురు మృతి చెందినట్టు సమాచారం. వెంటనే చంద్రబాబు నాయుడు తన ప్రసంగం ఆపేసి.. ఆసుపత్రి వెళ్లి బాధితులను పరామర్శించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. కందుకూరులో ఇలాంటి దుర్ఘటన జరగడం తన మనసు కలచివేసిందన్నారు. అమాయకులు చనిపోవడం బాధ కలిగిస్తోందన్నారు. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్టు ప్రకటించారు. బహిరంగ సభను సంతాప సభగా ప్రకటించిన చంద్రబాబు.. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బాధితుల పిల్లలను ఎన్టీఆర్ ట్రస్ట్ విద్యాసంస్థల్లో చదివిస్తామన్నారు.
కందుకూరు సభ విషాదం – మృతులు : దేవినేని రవీంద్రబాబు (ఆత్మకూరు), కలవకూరి యానాది (కొండమూడుసుపాలెం)
యాటగిరి విజయ (ఉలవపాడు)
కాకుమాని రాజా (కందుకూరు)
మరలపాటి చినకొండయ్య (గుళ్లపాలెం) పురుషోత్తం (కందుకూరు)
కందుకూరు మండలం ఓగురుకు చెందిన గడ్డం మధుబాబు
కందుకూరు కి ఈడుమూరి రాజేశ్వరి