హైదరాబాద్ మణికొండలోని ఓ.యు కాలనీలో గ్రావిటీ ఆటమ్స్‌ ను ప్రారంభించిన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు

హైదరాబాద్ మణికొండ


క్రియోటివిటీ, టెక్నాలజీ రంగం ఉహించని విధంగా అభివృద్ధి చెందుతుందని..అందుకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతికతను వినియోగించాల్సిన అవసరం ఉందని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అన్నారు.హైదరాబాద్ మణికొండ ఓయూ కాలనీలో ఏర్పాటు చేసిన గ్రావిటీ ఆటమ్స్ ను ఆయన ప్రారంభించారు .


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ డిజిటల్‌ రంగంలో యాడ్స్‌ ప్రధానంగా మారాయని, ఎన్ని యాడ్స్‌ పెరిగితే అంత పని కూడా పెరుగుందన్నారు. ఇలాంటి తరుణంలో అత్యాధునిక సాంకేతకతను వినియోగించాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు గత కొన్న సంవత్సరాలుగా గ్రావిటీ ఆధ్వర్యంలో ఎన్నో వినూత్నమైన యాడ్స్‌ రూపొందించారని, ప్రస్తుతం వారి సేవలకు అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ తోడైందని అన్నారు.

ప్రస్తుతం డిజిటల్ మార్కెటింగ్ రంగ ఏజెన్సీల పోటీ వ్యాపారంలో అధునాతనమైన గ్రావిటీ అటామ్స్ మెటావర్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని స్టూడియో ఎండీ విన్ను ముత్యాల అన్నారు. యాడ్ ఫిల్మ్ మేకింగ్‌లో దశాబ్దానికి పైగా అనుభవంతో మరో పది ఏళ్ల భవిష్యత్‌ను మందుగానే ఊహించి ఈ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. దీని కోసం ప్రత్యేకంగా రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియా వేదికగా పలు యాప్స్‌ వాడంకం అధికంగా పెరిగిందని, ఇలాంటి టెక్నికల్‌ డివైజ్‌లకు అనువై సాంకేతికతను, వినూత్న ఆవిష్కరణలుగా రూపొందిస్తున్నామని సీఈవో సాయి సుబ్బిరెడ్డి పోతంశెట్టి అన్నారు. క్లయింట్‌లకు సృజనాత్మకతతో కూడిన డిజిటల్‌ సేవలను అందించడంతో పాటు వారి మార్కెటింగ్‌ వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి అవసరమైన సహాకారాలను అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ దర్శకులు కళ్యాణ్‌ కృష్ణతో పాటు పలువురు సినీ ప్రముఖులు, టాప్‌మోడల్స్‌ పాల్గొని సందడి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *