వికేంద్రీకరణతోనే రాయలసీమకు న్యాయం

సీమ అభివృద్ధి కోసం ఇదే తుది సమరం

50 ఏళ్ల ఉద్యమానికి న్యాయ రాజధానితో న్యాయం

రౌండ్ టేబుల్ సమావేశంపై మీడియాతో జేఏసీ చైర్మన్

కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుతోనే రాయలసీమకు కనీసం న్యాయం చేసినవారవు
తారని, సీమను వెనుకబాటుతనం నుంచి ముందుకు నడిపించేందుకు విసృతంగా శ్రమించాల్సిన అవసరం ఉందని, వికేంద్రీకరణను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని జేఏసీ అభిప్రాయ పడినట్లు చైర్మన్ విజయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. భవిష్యత్ తరాల అవకాశాలు, ఉద్యోగాల కోసం వికేంద్రికరణ అవశ్యకం అని మేధావులు అభిప్రాయ పడినట్లు వివరించారు. వికేంద్రీకరణకు మద్ధతుగా, కుర్నూలులో న్యాయ రాజధాని సాధన కోసం ఏర్పటైన జేఏసీ రాయలసీమ మేధావులు, రాజకీయ నేతలతో జేఏసీ కర్నూలు నగరంలోని ఎన్ పేటలో చర్చా కార్యక్రమం నిర్వహించింది. ఈ చర్చా కార్యక్రమంపై జేఏసీ కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి మంగళవారం నాడు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం వికెంద్రీకరణకు మద్ధతుగా ఉన్నా కొన్ని శక్తులు రాయలసీమ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని పేర్కొన్నారు. న్యాయ రాజధానిని కొందరు స్వార్థం కోసం అడ్డుకుంటున్నారని దానిని త్వరిత గతిన సాధించుకునేలా జేఏసీ పని చేస్తుందన్నారు.

గుంటూరులో హై కోర్ట్ ఏర్పాటు చేయాలని ప్రకాశం పంతులు చాలా ప్రయత్నం చేశారని, 1951 వరదల్లో కేంద్ర ప్రభుత్వం, ప్లానింగ్ కమిషన్ సహకరించలేదన్నారు. వికేంద్రీకరణ కేవలం మాటల్లో కాదు అమలులో ఉండాలని పేర్కొన్నారు. దీనికి ప్రకాశం పంతులు గారే నిదర్శనం అని పేర్కొన్నారు. అభివృద్ధి సమానంగా ఉండాలని ఎందరో మహానుభావులు కలిసి శ్రీభాగ్ ఓడంబడిక ఒప్పందం చేసారని వివరించారు. చర్చలో జయరాజ్ మాట్లాడుతూ సీమ ప్రజలు 50 ఏళ్లుగా రాయలసీమ కు హై కోర్ట్ బెంచ్ రావాలని అనేక ఉద్యమాలు చేసామని గుర్తు చేశారు. ఈ రోజు మూడు రాజధానుల ఏర్పాటు జరుగుతున్నా లీగల్ అంశాలు రాజధానుల ఏర్పాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం మద్ధతు ఇస్తున్న మూడు రాజధానులు, వికేంద్రీకరణ అంశం ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం చాలా ఉందని పేర్కొన్నారు.

శ్రీభాగ్ ఒడంబడికను మనం ఆయుధంగా పట్టుకుని నడిస్తేనే కర్నూలుకు న్యాయ రాజధాని సాధ్యపడుతందని పేర్కొన్నారు. హై కోర్ట్, శాసన సభ ఒక వ్యవస్థ అని సీమకు రాజధాని వస్తే ఇక్కడ అభివృద్ధి తో పాటు పిల్లలకు అవకాశాలు వస్తాయన్నారు. వికేంద్రీకరణతో పాటు రాయలసీమ కోసం మరిన్ని అంశాలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. వికేంద్రీకరణ అంశాన్ని ముందుకు తీసుకెవెళ్లడంపై త్వరలోనే అఖిల పక్ష భేటీ నిర్వహించి అందరి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. దాని తర్వాత ప్రజల అభిప్రాయం తీసుకుని, అందరి మద్దతుతో కలిసి రాష్ట్ర హై కోర్ట్ కి, కేంద్ర ప్రభుత్వానికి మూడు రాజధానుల ఏర్పాటుపై ఒక విన్నపం చెయ్యాలని పేర్కొన్నారు. శ్రీ భాగ్ ఒప్పందం జరిగి 85 సంవత్సరాలైనా రాయలసీమకు పూర్తి న్యాయం జరగలేదన్నారు. ఎందరో నాయకలు సీమ నుంచి ఉన్నా కేవలం సీఎం జగన్ మాత్రమే రాయలసీమ కు హకోర్ట్ బెంచ్ కాదు హై కోర్ట్ ఇస్తామన్నారని కొనియాడారు. టీడీపీకి రాయలసీమపై ఎలాంటి చిత్తశుద్ధి లేదని, వికేద్రీకరణ తో రాయలసీమ ప్రజలకు న్యాయం జరగొద్దని అడ్డుపడుతోందన్నారు. రాయలసీమ న్యాయ రాజధాని కోసం ఇక్కడి ప్రజలు చేసే తుది సమరం మూడు రాజధానులదేనని జేఏసీ చర్చలో పేర్కొన్నట్లు వివరించారు. మనకు ఎయిర్ పోర్ట్ వచ్చింది.

రాజధానితో రాయలసీమలో ఇండస్ట్రీయల్ కారిడార్

కర్నూలుకు రాజధాని వస్తే రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు ఈ ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని జేఏసీ కన్వీనర్ తెలిపారు. హైదరాబాద్ నుంచి బెంగుళూరు వరకు ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుందని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడంతో మన ప్రాంతానికి మరిన్ని పరిశ్రమలు వస్తాయన్నారు. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ప్రస్తుతం హైకోర్టుకు వెళ్లాలంటే మనం ఎన్నో ప్రయాసలు పడవవాల్సి వస్తోందన్నారు. న్యాయ రాజధానితో సీమ అభివృద్ధి, సాధికారత సాధ్య పడతాయని ఈ అంశాలపై మద్దతు కూడగట్టెందుకు జేఏసీ విసృతంగా పని చేస్తుందని ట్
తెలిపారు.

జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ నేతల అభిప్రాయాలు

రాంభూపాల్ రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే

రాయలసీమలో న్యాయ రాజధాని కోసం మనం శ్రీ బాగ్ ఒడంబడికను గుర్తుంచుకోవాలి. శ్రీశైలం ప్రాజెక్టు కోసం దాదాపు 20 వేల ఎకరాల భూమిని ఇచ్చాం. రాయలసీమలో మనందరి త్యాగాలను గుర్తించేందుకు కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయాల్సిందే. దీని కోసం సీమ ప్రజలు ఐక్యంగా పొరాడాలి. ఇలాంటి సభలు, చర్చలు నిర్వహించడం వల్ల ఉమ్మడి ఏపీ కోసం సీమ ప్రజలు చేసిన త్యాగం ప్రపంచానికి తెలుస్తుంది.

బి. వై. రామయ్య, కర్నూల్ మేయర్

సీఎం అనుకుని ఉంటే కడపను రాజధాని చేయవచ్చు. కానీ రాయలసీమలో అన్ని విధాలుగా నష్టపోయిన శ్రీ బాగ్ ఒప్పందం మేరకు అర్హత ఉన్న కర్నూలుకు హైకోర్టు మాత్రమే కాకుండా జ్యుడీషియల్ క్యాపిటల్ ఇస్తామన్నారు. దీనిపై టీడీపీ, ఇతర పార్టీలు ద్వంద్వ వైఖిరి ప్రదర్శిస్తున్నాయి. బీజేపీ, సీపీఐ రెండు కళ్ల సిద్ధాంతంతో పనిచేస్తోంది. చంద్రబాబు రాయలసీమకు వ్యక్తి అయినా కర్నూలులో రాజధానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. సొంత ప్రయోజనాలు, బినామీల కోసం అమరావతి పేరుతో రాయలసీమ ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి న్యాయ రాజధాని ఏర్పాటు కోసం ఎంతవరకైనా పోరాడుతాం.

సంజీవ్ కుమార్, కర్నూల్ ఎంపీ

శ్రీభాగ్ ఒప్పందం ఉన్నా ఉమ్మడి ఏపీ నిర్మాణంలో రాయలసీమ పోగోట్టుకున్నది ఏంటి, దాన్ని వికేంద్రీకరణే ధ్యేయంగా ముందకు వెళుతున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎలా పొందాలన్నది మాత్రమే ప్రథమ కర్తవ్యంగా ఉందన్నారు. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు కోసం జేఏసీ మరింత వేగవంతం చేసి కర్నూలు రాజధాని ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *