ఏపీ కి వ్యాక్సిన్లు పంపాలని కేంద్రాన్ని కోరిన మంత్రి విడదల రజని
కరోనా కొత్త వేరియంట్..BF -7 కలకం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా పరిస్థితులు, నియంత్రణపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని కూడా విశాఖ నుంచి వర్చువల్ గా పాల్గొన్నారు.

ప్రస్తుతానికి రాష్ట్రంలో 47 వేల వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో వ్యాక్సిన్ నిల్వలు అయిపోతాయని అన్నారు. రాష్ట్రానికి అత్యవసరంగా వ్యాక్సిన్లు పంపాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.