దేశంలోనే మొట్టమొదటి సారిగా కాన్ టెంప్రరీ ,మోడ్రన్ ,అబ్ స్ట్రాక్ ఆర్ట్ షో …ఆకట్టుకుంటున్న కళాకృతులు
హైదరాబాద్,జూబ్లీహిల్స్
ఆర్టిస్ట్‌లు తమ సృజనాత్మకతతో రూపొందించిన కళాఖండాలను ప్రదర్శించేందుకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన గ్యాలరీని ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రముఖ చిత్రకారుడు రవీందర్ రెడ్డి అన్నారు .హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని కధారి అర్ట్ గ్యాలరీలో తొమ్మిది మంది ఆర్టిస్ట్‌లు తయారు చేసిన కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
దేశంలోనే మొట్టమొదటిసారిగా కధారి ఆర్ట్ గ్యాలరీలో అబ్‌స్టాక్ , కాన్‌టెంప్రరీ,మోడ్రన్, అబ్ స్ట్రాక్ ఆర్ట్ షోను ఇక్కడ ప్రదర్శించినట్లు కథారి ఆర్ట్ గ్యాలరీ నిర్వహకులు సుప్రజా రావు అన్నారు . ప్రముఖ చిత్ర కళాకారులైన లక్ష్మణ్ ఏలే, లక్షణ్ , రవీందర్ రెడ్డి తో పాటు ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
కళాకారులు తయారు చేసిన కళాత్మక చిత్రాలను ప్రదర్శించుకునేందుకు మోడ్రన్ ఆర్ట్ గ్యాలరీ అందుబాటులోకి తీసుకువచ్చిన సుప్రజారావును ప్రముఖులు అభినందించారు. యువ కళాకారులను ప్రొత్సహించాలనే ఉద్దేశంతో ఎంతో కళాత్మకంగా ఆర్ట్ గ్యాలరీని తీర్చిదిద్దిన సుప్రజారావు తెలిపారు.