ఒలింపిక్స్ లో రజతo సాధించిన రవికుమార్‌కు శుభాకాంక్షలు : నందమూరి బాలకృష్ణ
హైదరాబాద్
ఒలింపిక్స్ లో రజతం సాధించిన రవికుమార్‌కు హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలుతెలిపారు . ఒలింపిక్స్ లో రవికుమార్ చేసిన అద్భుత ప్రదర్శన చూసి దేశ మొత్తం గర్విస్తోందన్నారు. రవి విజయం దేశ ప్రజలందరిదని…. రవికుమార్ ప్రపంచ వేదికన దేశ ఖ్యాతిని చాటి చెప్పారన్నారు. రవికుమార్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని బాలకృష్ణ ఆకాంక్షించారు.