కలర్ ఫుల్ గా సాగిన మిస్ అండ్ మిస్టర్ అర్బన్ ఇండియా 2021పోటీలు

హైదరాబాద్ ,మాదాపూర్

హైదరాబాద్ లోని ప్రముఖ ఫ్యాషన్ ఏజెన్సీ సీ మాఫ్ గ్లోబల్ సంస్థ నిర్వహించిన మిస్ అండ్ మిస్టర్ అర్బన్ ఇండియా 2021 పోటీలు కలర్ ఫుల్ గా సాగాయి.

హైదరాబాద్ మాదాపూర్ లోని ఎం బ్యాంకెట్ హాల్ లో శనివారం మిస్ అండ్ మిస్టర్ అర్బన్ ఇండియా టైటిల్ దక్కించుకునేందుకు యువత పోటీ పడ్డారు.

అట్టహాసంగా నిర్వహించిన ఈ పోటీల్లో యువతీ యువకులు తమ టాలెంట్ ను ప్రదర్షించారు. దీనికి సంబంధించిన నాలుగు ఎడిషన్లు కరోనా లాక్ డౌన్ కారణంగా ఆన్లైన్ లో నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు శరకడం శ్రీనివాస్ తెలిపారు.

దేశవ్యాప్తంగా 300 మంది ఆడిషన్స్ లో పాల్గొనగా ఈ ఫైనల్ లో 50 మంది మోడల్స్ సెలక్ట్ అయ్యారని తెలిపారు. .సినీ నిర్మాత రియల్ ఎస్టేట్ సంస్థ అధిపతి విజయ్ పాల్ రెడ్డి విజేతలకు మెమొంటోలు , సర్టిఫికెట్ అందజేశారు .

ఈ పోటీ లకు న్యాయ నిర్ణేతలు గా మిస్సెస్ అర్బన్ 2019 విజేత శ్రీవాణి, మ్యూజిక్ డైరెక్టర్ మోహిని మృదుల్ ,ఫ్యాషన్ డిజైనర్ దీపాలి మెహతా,సెలబ్రెటీ కొరియోగ్రాఫర్ నరసింహా రెడ్డిలు వ్యవహరించారు. సీమాఫ్ గ్లోబల్ సంస్థ నిర్వాహకుడు శరకడంశ్రీనివాస్ మాట్లాడుతూ మా సంస్థ తరఫున ఇది 31 ఈవెంట్ అని ఇప్పటి వరకు సుమారు వందమందికి పైగా పలు సినిమాలు ,వెబ్ సిరీస్ లో అవకాశాలు పొందారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *