ఒకవైపు చలి, మరోవైపు చిరుజల్లులు.. హైదరాబాద్ వణుకుతోంది..!

హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఒకవై చలి, మరో వైపు చిరుజల్లులతో నగరవాసులు వణికిపోతున్నారు. రెండు రోజులుగా నగరంలో పొగమంచు కురుస్తున్నది. ఇవాళ ఉదయం నుంచే నగర వ్యాప్తంగా మంచుతెరలు దట్టంగా కమ్మేశాయి. దీంతో ఉదయం 8 గంటలకు కూడా మసక మసక చీకట్లు కమ్ముకున్నాయి. దీనికి చినుకులు తోడవడంతో ప్రజలు ఇండ్లకే పరిమితయ్యారు.
నగరంలోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి చినుకులు కురుస్తున్నాయి. వనస్థలిపురం, ఎల్బీనగర్, హబ్సిగూడ, తార్నాక, బేగంపేట, పంజాగుట్టా, అమీర్‌పేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఆర్టీ క్రాస్ రోడ్స్, చింతల్, బాలానగర్, సుచిత్ర, కుత్బుల్లాపూర్‌తోపాటు పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి.