చలిగుప్పిట ఉత్తర భారతం.. భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
ఉత్తర భారతదేశం చలితో వణుకుతున్నది. ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలితీవ్రత పెరుగుతున్నది. చాలా ప్రాంతాల్లో పది డిగ్రీల కంటే తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గ్వాలియర్, రేవాలో ఉదయం దట్టమైన పొగమంచుకు పేరుకుపోతున్నది. జమ్ము కశ్మీర్‌లోని చాలా ప్రాంతాల్లోనూ చలి కొనసాగుతున్నది. శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గామ్‌లలో పాదరసం ఐదు డిగ్రీల దిగువకు పడిపోయింది. ఇవాళ, రేపు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఈ నెల 6 నాటికి ఉష్ణోగ్రత నాలుగు డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఢిల్లీ, చండీగఢ్, హర్యానాలలో రానున్న మూడు, నాలుగు రోజుల పాటు ఉదయం పూట దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నిన్న పంజాబ్ భటిండాలో ఉష్ణోగ్రతలు 0.4 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోగా.. హర్యానాలోని మాండ్‌కోలాలో కనిష్ఠ ఉష్ణోగ్రత 1.3 డిగ్రీలు, ఫతేహాబాద్‌లో 3.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజస్థాన్‌లోనూ చలి కొనసాగుతున్నది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 5కు పడిపోయాయి.
