రేపు సీఎం జగన్‌ నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ పర్యటన

గుంటూరు :

వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ పథకం రెండో విడత ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోమవారం నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ లో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరనున్న సీఎం 10.15 గంటలకు ఆళ్ళగడ్డ చేరుకుంటారు. 10.45 – 12.10 గంటలకు వైపీపీఎం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు, అనంతరం వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ రెండో విడత నగదు బదిలీని బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో జమచేయనున్నారు. మధ్యాహ్నం 12.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 2.15 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *