మా ఆవేదనను సీఎం జగన్‌ అర్థం చేసుకున్నారు: ఉద్యోగ సంఘాలు

సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న పీఆర్సీ సాధన సమితి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మరోసారి కృతజ‍్ఞతలు తెలిపింది. ఆదివారం ఉద్యోగ సంఘాల నేతలు సీఎం వైఎస్‌ జగన్‌తో భేటీ అయ్యి పలు అంశాలపై స్పష్టత తీసుకున్న విషయం తెలిసిందే. భేటీ అనంతరం మీడియాతో ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడారు.

సీఎం వైఎస్‌ జగన్‌ది చాలా పెద్ద మనసు అని, ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందించారని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. సీపీఎస్‌ రద్దు సహా అనేక అంశాల్లో స్పష్టత ఇచ్చారని ఉద్యోగ సంఘ నేతలు తెలిపారు. ఉద్యోగుల ఆవేదనను సీఎం జగన్‌ అర్థం చేసుకున్నారని, అన్ని అంశాల్లో వెసులుబాటు కల్పించారని అన్నారు.

ఉద్యోగ సమస్యలపై మంత్రుల కమిటీ కొనసాగుతుందని, ఏ సమస్య ఉన్నా కమిటీకి చెప్పుకోవచ్చని, అవసరమైతే నేరుగా తనతోనే మాట్లాడొచ్చని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీపై ఉద్యోగ సంఘ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగుల భాగస్వామ్యం, చర్చలతోనే భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారన్నారు. ఉపాధ్యాయ సోదరులు కూడా మంచి మనుసుతో అర్థం చేసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు పిలుపు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *