ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

ఢిల్లీ బాట పట్టిన ఏపీ సీఎం జగన్జ.. ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం జగన్ కోరినట్లు తెలుస్తుంది. ఏపీకి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలు, పోలవరం సహా పలు అంశాలను ప్రస్తావించిన సీఎం.. విభజన చట్టం హామీలు చాలావరకు పెండింగ్లోనే ఉన్నాయని గుర్తుచేశారు. ఏపీ, తెలంగాణ మధ్య చాలా అంశాలు అపరిష్కృతంగానే ఉన్నాయన్న సీఎం.. పోలవరం ప్రాజెక్టుకు రూ.55,548 కోట్లు అవుతుందని, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదించిన విషయాన్ని వివరించారు.

దేనితో పాటు APలో జిల్లాల పునర్విభజన తర్వాత జిల్లాల సంఖ్య 26కు చేరిందని CM జగన్ ప్రధాని మోదీకి వివరించారు. కేంద్రం కొత్తగా మంజూరు చేసిన 3 మెడికల్ కాలేజీలతో కలిపి రాష్ట్రంలో మొత్తం 14 మాత్రమే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయని.. మిగిలిన 12 జిల్లాలకు కాలేజీలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. విశాఖలో 76.9KM మేర మెట్రో రైలుకు DPR సిద్ధం చేశామని.. విశాఖ మెట్రో రైలు నిర్మాణానికి సహకరించాలని ప్రధానిని CM కోరారు.