సీఎం జగన్ రాయలసీమకు తీరని ద్రోహం చేశారు- తులసిరెడ్డి
ముఖ్య మంత్రి జగన్ రాయలసీమకు తీరని ద్రోహం చేస్తున్నారని ఏపీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఆరోపించారు . ప్రధానంగా 9 అంశాలపై ద్రోహం చేశాడన్నారు. ఒకటి విభజన చట్టం లో సెక్షన్ 46 సబ్ సెక్షన్ (3) ప్రకారం రాయలసీమకు కేంద్రం నుండి బుందేల్ ఖంద్ తరహా ప్యాకేజ్ నిధులు తెప్పించాలి.తెప్పించలేదన్నాడు .రెండు విభజన చట్టం ప్రకారం కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యం లో స్టీల్ ప్లాంట్ పెట్టాలి.పెట్టలేదన్నారు .మూడు రాష్ట్ర సచివాలయాన్ని అమరావతి నుండి విశాఖ కు తరలిస్తే దూరం కారణంగా ఎక్కువ నష్టపోయేది రాయలసీమ వాసులేనన్నారు .ఇక నాలుగోవది శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టు ను రాయలసీమ లో ఏర్పాటు చేయాలి.ఇప్పటి వరకు హై కోర్ట్ లేదు.హైకోర్టు బెంచ్ లేదన్నారు .ఐదు. కడప,బెంగళూరు రైలు మార్గం రాయలసీమ అభివృద్ధికి ఎంతో ముఖ్యం.జగన్ ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వని కారణంగా పనులు నిలిచి పోయాయి.
6.కృష్ణా నదీ యాజమాన్య బోర్డ్ కార్యాలయాన్ని కర్నూల్ లో కాకుండా విశాఖ లో పెట్టమని ప్రభుత్వం లేఖ వ్రాయడం ద్రోహం.
7.తెలుగు గంగ,గాలేరునగరి,హంద్రీనీవా తదితర ప్రాజెక్టులు నిధులు లేని కారణంగా ముందుకు సాగడం లేదు.
8.తెలంగాణా ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులు పాలమూరు రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను అడ్డుకోవడం లేదు.
9.వ్యవసాయ పంపు సీట్లకు మీటర్లు బిగిస్తే ఎక్కువ నష్టపోయేది రాయలసీమ వాసులు.
అందుకే రాబోవు సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ పార్టీని ఓడించి కాంగ్రెస్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు .