పులివెందుల సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలను… హాజరైన సీఎం జగన్

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పులివెందుల సీఎస్ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. అనంతరం చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో సీఎం జగన్. మూడు రోజులుగా కడపలో పర్యటిస్తున్న జగన్ నేడు క్రీస్మిస్ వేడుకులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరుణ, ప్రేమ, దాతృత్వం, త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలు. మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రజలకు కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు లభించాలని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు .