ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు
ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను తెదేపా అధినేత చంద్రబాబు దర్శించుకున్నారు. జనపక్షాన పోరాడేందుకు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని…ప్రజల ఇబ్బందులు తొలగించాలని కోరుకున్నానని తెలిపారు. రాజీలేని పోరాటంతో ప్రజలకు అండగా నిలబడతానని చెప్పారు.
పుట్టినరోజు సందర్భంగా బెజవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను తెదేపా అధినేత చంద్రబాబు దర్శించుకున్నారు. చంద్రబాబుకు ఆలయ ఈవో భ్రమరాంబ స్వాగతం పలికారు. ప్రజలకు దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానని చంద్రబాబు తెలిపారు. జనపక్షాన పోరాడేందుకు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని.. ప్రజల ఇబ్బందులు తొలగించాలని కోరుకున్నానని స్పష్టం చేశారు