కైకాల మృతిపై చంద్రబాబు నాయుడు సంతాపం
కైకల సత్యనారాయణ మృతి తెలుగు చిత్ర సీమకు తీరని లోటని… టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

విభిన్నపాత్రల్లో నటించి, తన విలక్షణ నటన ద్వారా అభిమానులచేత నవరసనటనాసార్వభౌమ అనిపించుకున్న మేటి నటులు, టీడీపీ మాజీ పార్లమెంటు సభ్యులు కైకాల సత్యనారాయణ గారి మరణం విచారకరం. సత్యనారాయణగారి ఆరు దశాబ్దాల సినీ జీవితంలో ఎన్టీఆర్ గారితో ఆయనకున్న అనుబంధం సొంత అన్నదమ్ముల బంధం కన్నా ఎక్కువ.
సత్యనారాయణగారి మరణం సినీరంగానికి తీరని లోటు. ఆయన ఆత్మ శాంతికై ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.