కాపు ఓట్ల కోసం చంద్రబాబు.. పవన్‌ను గాలంగా వేశారు: అంబటి రాంబాబు
ఓ వర్గం ఓట్ల కోసం చంద్రబాబు.. పవన్ కళ్యాణ్‌ను గాలంగా వేశారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబును సీఎం చేసేందుకే పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడడమే లక్ష్యమని చెప్పాడని దుయ్యబట్టారు. పవన్‌కు తనకంటూ సొంత ఆలోచన లేదుని మండిపడ్డారు.
ఏపీ మంత్రుల మీద సెటైర్లు వేసిన విషయం పవన్‌కు గుర్తు లేదా? అని సూటిగా ప్రశ్నించారు. టీడీపీ పాలనలో రైతులు అన్యాయానికి గురైతే పవన్ ఏనాడూ మాట్లాడలేదని, రుణమాఫీ చేస్తానని ఎగ్గొట్టినప్పుడు కూడా నోరెత్తలేదని మండిపడ్డారు. కానీ రైతుల కోసం జగన్ ఎంతో మేలు చేస్తున్నా పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
క్రాప్ ఇన్సూరెన్స్, సబ్సిడీలు అన్నీ సరైన సమయంలో అందిస్తున్నామని తెలిపారు. పవన్ కళ్యాణ్.. చంద్రబాబు చేతిలో పావు అని మండిపడ్డారు. కాపులు అందరూ టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. అందుకే వారిని పట్టుకోవటానికి చంద్రబాబు వేదిన గేలమే పవన్ కళ్యాణ్ అని దుయ్యబట్టారు. సీఎం వైఎస్ జగన్ వ్యతిరేక ఓటును చీల్చటానికే తాను ప్రయత్నం చేస్తున్నానని పదేపదే చెప్తున్నారని విరుచుకుపడ్డారు.