ప్రభుత్వంతో చర్చలు విఫలం.. ఉద్యమ కార్యాచరణ యథాతథం: పీఆర్సీ సాధన సమితి
చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి – పీఆర్సీ సాధన సమితి
ఉద్యోగుల ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకే ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించిందని పీఆర్సీ సాధన సమితి నేతలు మండిపడ్డారు. మంత్రుల కమిటీతో చర్చలు విఫలమైనట్లేనని ఉద్యోగ సంఘాల నేత బండి శ్రీనివాస్ అన్నారు. చర్చలకు పిలిచి గతంలో ఏం చేశారో ఇప్పుడూ అదే చేశారన్నారు. ఉద్యమ కార్యాచరణ యథావిధిగా జరుగుతుందని వెల్లడించారు. చలో విజయవాడను విజయవంతం చేయాలని ఉద్యోగలకు సూచించారు. ప్రభుత్వానికి వత్తాసు పలికే పనులను మానుకోవాలని కలెక్టర్లకు సూచించిన ఆయన..ఉద్యోగులను భయపెట్టవద్దని విజ్ఞప్తి చేశారు.*
మంత్రుల కమిటీతో చర్చలు విఫలం
చర్చలకు పిలిచి గతంలో ఏం చేశారో ఇప్పుడూ అదే చేశారని బండి శ్రీనివాస్ అన్నారు. ఉద్యమ కార్యాచరణ యథావిధిగా జరుగుతుందని..చలో విజయవాడను విజయవంతం చేయాలన్నారు. ఉద్యోగులను భయపెట్టవద్దని కలెక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నామని… ప్రభుత్వానికి వత్తాసు పలికే పనులను కలెక్టర్లు మానుకోవాలన్నారు. . సమ్మె, ఆందోళన తాత్కాలికంమని….మళ్లీ కలిసే పని చేయాల్సి ఉంటుందని తెలిపారు. కొత్త పీఆర్సీతో నష్టపోతున్నట్లు పదేపదే చెప్పామని బండి శ్రీనివాస్ అన్నారు. ఇవాళ్టి భేటీలోనూ పాత అంశాలపైనే మాట్లాడారన్నారు. తాము చెప్పిన 3 అంశాలపై తేల్చాలని స్పష్టం చేసినట్లు వెల్లడించారు. తాము చెప్పిన అంశాల పరిష్కారం సాధ్యపడదని మంత్రుల కమిటీ చెప్పిందని అన్నారు.