కోవిద్ 19 ను ఎదుర్కోవడంలో ఓరల్ యాంటీ వైరల్ డ్రగ్ “క్లెవిరా”కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం

తేలికపాటి నుంచి మధ్యస్థాయి కోవిద్ 19ను ఎదుర్కొవడంలో ఓరల్ యాంటీబైరల్ టాబ్లెట్ క్లెవైరాకు భారత ప్రభుత్వ రెగ్యులేటరీ అమోదించడం సంతోషంగా ఉందని అపెక్స్ లేబోరేటరీస్ సంస్థ ప్రతినిధి అర్థర్ పాల్ తెలిపారు.

తమిళనాడుకు చెందిన అపెక్స్‌ల్యాబ్స్ సంస్థ కోవిద్ 19 ను ఎదుర్కొనే క్లెవిరా ట్యాబ్లెట్ల అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ మెర్క్యూరీ హోటల్‌లో అపెక్స్ ల్యాబ్స్ సంస్థ రూపొందించిన క్లెవిరా ట్యాబ్లెట్లను విడుదల చేశారు . భారత ప్రభుత్వం, ICMR లు క్లెవిరా ట్యాబ్లెట్లు కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోగలవని గుర్తించినట్లు సంస్థ ఇంటర్నేషనల్ బిజినెస్ హెడ్ అర్థర్ పాల్ తెలిపారు. చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రితో పాటు దేశంలోని వివిధ నగరాల్లో చికిత్స పొందుతున్న కరోనా పేషంట్లకు ఈ ట్యాబ్లెట్లు ఇచ్చి ఫలితాల విశ్లేషించగా కోవిద్ పాజిటివ్ రోగులు ఐదు రోజుల్లోనే నెగిటివ్‌గా మారారని …కోవిద్‌ థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు క్లెవిరా ట్యాబ్లెట్లు దోహదపడతాయన్నారు .ఒక్కో ట్యాబ్లెట్ కేవలం 11 రూపాయలు మాత్రమేనని… 15 రోజుల పాటు ట్యాబ్లెట్లు వాడితే కోవిద్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు ఆయన తెలిపారు . నాలుగు దశాబ్ధాలుగా వైద్య రంగంలోని పలు ఔషధాలు, ఓరల్ యాంటీ వైరల్ డ్రగ్స్‌పై పరిశోధన , ఆవిష్కరణ చేస్తోంది. చైన్నైకి చెందిన ఔషధాల తయారీ సంస్థ అపెక్స్ ల్యాబోరేటరీ. తాజాగా తేలికపాటి నుంచి మధ్యస్థ స్థాయికి చెందిన కోవిద్‌19 నుండి కోలుకోవడంలో మద్దతును అందించేందుకు పని చేస్తున్న తమ యాంటీ వైరల్ డ్రగ్ క్లెవైరాకు కేంద్ర ప్రభుత్వం అమోదం తెలపడం సంతోషంగా ఉందని సంస్థ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ హెడ్ అర్థర్ పాల్ తెలిపారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *