పీఎం కేర్స్ ఫ‌ర్ చిల్డ్ర‌న్ స్కీంను ఫిబ్ర‌వ‌రి 28 వ‌ర‌కు పొడ‌గించిన కేంద్రం

న్యూఢిల్లీ

క‌రోనా కారణంగా త‌ల్లిదండ్రును కోల్పోయిన పిల్ల‌ల‌ను ఆదుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన పీఎం కేర్స్ ఫ‌ర్ చిల్డ్ర‌న్ స్కీంను ఈ నెలాఖ‌రు వ‌ర‌కు పొడ‌గించింది. ఈ పీఎం కేర్స్ ఫర్ చిల్డ్ర‌న్ స్కీమ్ ఈ నెల 28 వరకు పొడిగిస్తూ రాష్ట్ర కుటుంబ శిశు సంక్షేమ శాఖ‌ల కార్య‌ద‌ర్శుల‌కు కేంద్ర మ‌హిళా శిశు సంక్షేమ శాఖ లేఖ రాసింది . కోవిద్ 19 కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను ఆదుకునేందుకు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఈ పీఎం కేర్స్ పథకాన్ని తీసుకువ‌చ్చారు. 2021 మేలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పథకాన్ని ప్రకటించారు. కోవిడ్ కార‌ణంగా తల్లిదండ్రులు చ‌నిపోతే .. 18 వయస్సు దాటని పిల్లలు ఈ పథకం కింద సాయం పొందే అవ‌కాశం ఉంది. ఈ ప‌థ‌కంకు అర్హులైన పిల్లలకు 23 ఏళ్ళ వరకు విద్య, వైద్య , ఆర్థిక సహాకారం అందజేయ‌డంతో పాటు… 23వ ఏట ప్రతి ఒక్కరికి 10 లక్షలు అందజేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *