విజయవాడలో అక్టోబర్ 8 వ తేదీన సెలబ్రిటీ డిజైనర్ శశి వంగపల్లి ముగ్ధ స్టోర్ ప్రారంభం
విజయవాడ
టాలీవుడ్ సెలబ్రిటీ డిజైనర్‌గా, లాక్మే వంటి ప్రఖ్యాత ఫ్యాషన్ ఈవెంట్స్‌లో పాల్గొన్న ప్రముఖ డిజైనర్ శశి వంగపల్లి తన ముగ్ధ స్టోర్‌ను విజయవాడలో ప్రారంభించనుంది.
ఇప్పటికే తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో ముగ్ధ డిజైనర్ స్టూడియో ని ఏర్పాటు చేసి ఫ్యాషన్ ప్రియుల ఆదరాభిమానాలను పొందిన శశి వంగపల్లి… ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన నగరమైన విజయవాడ , వైజాగ్ వాసుల కోసం తన ముగ్ధ స్టోర్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
ఈ సందర్భంగా శశి వంగపల్లి మాట్లాడుతూ ‘‘ విజయవాడ నా అభిమాన నగరాల్లో ఒకటి అని.. మాకు ఇక్కడ చాలా మంది సన్నిహుతులు ముఖ్యంగా ఏళ్లతరబడి క్లయింట్స్ ఉన్నారని తెలిపారు. ఇక్కడ జరిగిన ఎన్నో అద్భుతమైన వివాహ వేడుకల్లో మేం భాగం పంచుకున్నామన్నారు. అంతేకాదు ఇక్కడ నుంచీ హైదరాబాద్‌లోని మా స్టోర్స్‌కు ప్రతీ రోజూ ఎందరో క్లయింట్స్ వస్తుంటారని… ఈ అందమైన నగరంలో భాగం కావడమనేది మా కల అని శశి వంగపల్లి అన్నారు. ఎందుకంటే ఇది మా అమ్మగారు పుట్టిన ఊరుని..అందువల్ల కూడా ఈ నగరంలో స్టోర్ ప్రారంభించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నామన్నారు. ఆ కల ఇప్పటికి సాకారమైందని సంతోషం వ్యక్తం చేశారు.
టెంపుల్ థీమ్ స్టోర్ అనేది శశివంగపల్లి ముగ్ధ స్టోర్స్‌కి మాత్రమే ప్రత్యేకమని డిజైనర్ శశి వంగపల్లి అన్నారు. అన్ని విషయాల్లోనూ దేశంలోనే అత్యంత వినూత్నమైన స్టోర్‌గా రూపుదిద్దుకుంటుదన్నారు. కస్టమర్లకు ఆహ్లాదకరమైన షాపింగ్ అనుభూతిని అందించే ఈ స్టోర్ ఇప్పుడు విజయవాడ నగరవాసులకు అందుబాటులోకి వస్తోందన్నారు. అక్టోబరు 8 వ తేదీన 2021న ప్రారంభిస్తున్నట్లు ఆమె తెలిపారు. తమ వద్ద ప్రత్యేకమైన, ఉత్తమమైన కలెక్షన్స్ మాత్రమే కాదు ధరలు కూడా అందుబాటులోనే ఉంటాయన్నారు. ఎల్లప్పుడూ మేం నాణ్యతపైనే దృష్టి సారిస్తామని… డిజైన్లు, దుస్తుల నాణ్యత రెండింటి పరంగానూ మా కస్టమర్లకు ఉత్తమమైనవే అందివ్వాలని ఆశిస్తామన్నారు. ఈ స్టోర్ ప్రారంభోత్సవ వేడుకలకు సినీ ,రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.