హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఘనంగా హోం 360 డిగ్రీస్ షోరూం ఐదో వార్షికోత్సవ వేడుకలు

హైదరాబాద్,జూబ్లీహిల్స్

ఇంటి కావాల్సిన అన్ని రకాల ఇంటీరియర్ ఉత్పత్తులు ఒకే ఫ్లాట్ ఫాంపై అందించడం తమ లక్ష్యమని హోం 360 ఫౌండర్ శ్రీధర్ ,రాఠీ, శారదలు అన్నారు .

హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 40లోని హోం360 షోరూం ఐదవ వార్సికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ షోరూంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నెక్సియన్ ప్రొడెక్ట్స్ ను ఆవిష్కరించారు. హోం 360 ఐదవ వార్షికోత్సవ వేడుకలను డీలర్లు,కస్టమర్లు, ఇంటీరియర్ డిజైనర్లు పాల్గొన్నారు .

ఈ సందర్భంగా హోం 360 వ్యవస్థాపకులు శ్రీనాథ్ రాఠీ,శారద మాట్లాడుతూ… టైల్స్, బాత్రూం ఫిటింగ్స్ , మాడ్యులర్ కిచెన్, వార్డ్ రోబ్ లు, వెల్ నెస్ లాంటి పలు అవసరాలకు వన్ స్టాప్ సొల్యూషన్ గా క్లయింట్ల నుంచి ప్రశంసలు అందుకుందన్నారు . కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా సంప్రదాయ అత్యాధునికత కలియకతో ఉత్పత్తులను తీసుకువచ్చామన్నారు .
దక్షిణభారత దేశంలో గ్లోబల్ లీడర్ గా పేరొందిన నెక్సియాన్ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు హోం 360 డిగ్రీస్ వ్యవస్థాపకులు శ్రీధర్ , అరుణలు తెలిపారు . నెక్సియన్స్ ఫినిషింగ్స్ లో కొత్త శ్రేణి ఉత్పత్తులు తీసుకువచ్చామన్నారు .
నెక్సియన్ సీఈఓ లూకా మజోచి మాట్లాడుతూ నెక్సియాన్ బ్రాండ్ దేశ ,విదేశాల్లో అగ్రగామిగా ఎదిగిందన్నారు . సిరామిక్ ఉత్పత్తుల తయారీ రంగంలో సెరామికా స్పెరంజా,నెక్సియాన్ బ్రాండ్ లు అగ్రగామిగా ఎదిగాయన్నారు. 1961 నుంచి సెరామికా స్పెరంజా మార్కెట్ లోకి రాగా… 1977 నుంచి నెక్సియాన్ సంస్థ కొనసాగుతుందన్నారు. ఈ సిరామిక్ ,శానిటరీ వేర్ రంగంలో అఘరా కుటుంబాలు ఉన్నాయన్నారు. ఇటాలియన్ విభాగంలో మోర్బిలో అత్యాధునిక తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసిందన్నారు . కంపెనీ 9 మిల్లీమీటర్ల విభాగంలో అధిక నాణ్యత కలిగిన సింటర్డ్ స్టోన్ శ్లాబులను, డిజైన్, తయారీ, చేసి ఎగుమతి చేస్తుందన్నారు. ఇది టైల్స్ లో తాజా, అత్యంత శక్తివంతమైన సెగ్మెంట్ అని.. పాలరాయి, రాయి, కలప, కాంక్రీట్ లాంటి సహజ, కృత్రిమ ఉపరితలాలను పోలి ఉంటాయన్నారు. సుందరంగా డిజైన్ చేసిన మెరుగైన టైల్స్ ని రూపొందించడానికి కొత్తతరం ప్రెస్ టెక్నాలజీ, అధునాతన డిజిటల్ ప్రింటింగ్, గ్లేజింగ్ ఉపయోగించి ఈ ఉత్పత్తులను తయారుచేస్తున్నట్లు ఆయన తెలిపారు .

నెక్సియాన్ ఉత్పత్తులను మేకిన్ ఇన్ ఇండియా మేడిన్ ఇన్ ఇండియా కాన్సెఫ్ట్ తో మోర్బీ ఫ్లాంట్ లో తయారు చేస్తున్నట్లు హోం 360 డిగ్రీస్ వ్యవస్థాపకులు శ్రీథర్ తెలిపారు .అతితక్కువ ధరల్లో నాణ్యమైన నెక్సియాన్ ఉత్పత్తులను అందిస్తున్నామన్నారు. ఈ ఉత్పత్తులన్ని ఇటాలియాన్ ప్రయోగశాలలో పరీక్షలు నిర్వహించి ,అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఖరారు చేసిన తర్వాతే విడుదల చేసినట్లు ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *