రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్లలో ఇకపై సీబీఎస్ఈ సిలబస్.. ఎక్కడో తెలుసా ?
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ప్రవేశానికి అడుగులు వేస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి 1 నుంచి 7వ తరగతులకు కూడా CBSE సిలబస్ కు అనుగుణంగా టెస్ట్ పుస్తకాలు తీసుకురానుంది. ప్రస్తుతం 8వ తరగతిలో ఈ విధానం ఉండగా ఇక అన్ని తరగతులకు CBSE టెస్ట్ పుస్తకాలే ఉండనున్నాయి. సోషల్ సబ్టెక్ట్ మాత్రం స్టేట్ సిలబస్ ఉంటుంది. విద్యార్థులు CBSE సిలబస్ చదివినా.. బోర్డ్ అనుమతి లేకపోతే రాష్ట్ర బోర్డు పరీక్షలే రాయాల్సి ఉంటుంది.
