హైదరాబాద్ లో మాదాపూర్ ,ఈసీఐఎల్, హిమాయత్ నగర్ లలో కేరీర్ పాయింట్ కోచింగ్ సెంటర్ ప్రారంభం
హైదరాబాద్ లక్డీకపూల్
జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన ఐఐటీ,నీట్,జేఈఈ ప్రవేశ పరీక్షల్లో విద్యార్థుల కలను నిజం చేస్తున్న కేరీర్ పాయింట్ హైదరాబాద్‌లో సేవలను విస్తరించింది.హైదరాబాద్ ఈసీఐఎల్, మాదాపూర్ ,హిమాయత్‌నగర్‌లలో తమ కోచింగ్ సెంటర్లను ప్రారంభించినట్లు సంస్థ ఛైర్మెన్ ఉదయ భాస్కర్ తెలిపారు .
దేశ విద్యా వ్యవస్థలో కేరిర్ పాయింట్ సంస్థ కొత్త కోణాన్ని ఆవిష్కరించింది . నీట్, జేఈఈ, ఐఐటీ లలో అత్యుత్తమ కోచింగ్ ను అందించేందు కోటా రాజస్థాన్ హైదరాబాద్ వచ్చింది.హైదరాబాద్ లక్డీకపూల్ లో ని సెంట్రల్ కోర్ట్ హోటల్ లో కేరీర్ పాయింట్ కోచింగ్ సెంటర్ ను లాంఛనంగా ప్రారంభించారు కెరీర్ పాయింట్ ప్రతినిధులు. 1993 సంవత్సరంలో రాజస్థాన్ కోటా స్థాపించబడి ప్రాథమిక దశ నుండి పీహెచ్డీ వరకు గత 28 సంవత్సరాలుగా భారతదేశంలో విద్యను అందిస్తుందన్నారు. పోటీ పరీక్షల్లో అత్యధిక సక్సెస్ రేట్ ను సాధిస్తూ ప్రథమ స్థానంలో నిలబడిన కెరీర్ పాయింట్…. ఇప్పుడు హైదరాబాదులో తమ ప్రస్థానాన్ని ప్రారంభించిందని కేరీప్ పాయింట్ ఛైర్మెన్ ఉదయ భాస్కర్ అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో… అత్యుత్తమ నిపుణులైన అధ్యాపకులతో విద్యార్థికి అర్థమయ్యే రీతిలో బోధిస్తుందన్నారు. విద్యార్థుల కలలను నిజం చేయడానికి కృషి చేస్తున్న కెరీర్ పాయింట్ హైదరాబాదులోని మూడు బ్రాంచ్ లు ఏర్పాటు చేసిందన్నారు .ఈసీఐఎల్, హిమాయత్ నగర్, మాదాపూర్ లో తమ కోచింగ్ సెంటర్ లను ప్రారంభించినట్లు ఆల్ ఇండియా చీఫ్ నితిన్ దాధిచ్ తెలిపారు. ఐఐటి, జేఈఈ, నీట్ కోచింగ్ లలో తమకు ఎవరు సాటి లేరు అంటూ నిలబడ్డ కేరీర్ పాయింట్… ఇప్పుడు కోచింగ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న విద్యార్థుల భవిష్యత్తు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి తమ తోడ్పాటు అందిస్తామన్నారు. 2021 – 22 సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభిస్తున్నాట్లు కెరీర్ పాయింట్ ప్రతినిధులు తెలిపారు .