విభిన్న ఆహార రుచులకు కేరాఫ్ హైదరాబాద్ : నటి నివేతా పేతురాజు
సికింద్రాబాద్,ఏఎస్ రావు నగర్
భోజన ప్రియులు కు నోరూరించే వంటకాల రుచులను మరో కొత్త రెస్టారెంట్ అందుబాటులో కి వచ్చింది.
హైదరాబాద్ ఏ.యస్. రావు నగర్ లో ” జిస్మత్ మండి “అరబిక్ జైల్ ధీమ్ రెస్టారెంట్ ను టాలీవుడ్ నటి, పాగల్ మూవీ ఫేమ్ నివేతా పేతురాజు , గంగవ్వలు కలసి ప్రారంభించారు.
ఈ సందర్భంలో సినీనటి నేవితా పేతురాజు మాట్లాడుతూ విభిన్న ఆహార రుచులను అందించేందుకు హైదరాబాద్ కేరాఫ్ గా నిలుస్తుందని అన్నారు.
నాన్ వెజ్ వంటకాలంటే ఎంతో ఇష్టమని ..అందులో మటన్ బిర్యానీ ,మటన్ టిక్కా అంటే చాలా ఇష్టమని చెప్పారు.
భోజన ప్రియులకు విభిన్న రుచులను అందించేందుకు, జైల్ థీమ్ తో ఇక్కడ రెస్టారెంట్ ను ఏర్పాటు చెయడం అభినందనీయమని ఆమె అన్నారు.
ఈ సందర్భంగా జిస్మత్ అరబిక్ మండి నిర్వాహకులు నిర్వహకులు గోపి నవులూరి, కేషవరెడ్డి, కృష్ణకాంత్ , నారా ఆనంద్ , ప్రముఖ యూట్యూబర్ గౌతమి మాట్లాడుతూ.. విజయవాడ, గుంటూరు, వైజాగ్, నెల్లూరులో బ్రాంచీలు కలిగిన తమ జిస్మత్ మండి ఇప్పుడు ఏ.యస్.రావు నగర్ లో కొత్తగా రెస్టారెంట్ ను ఏర్పాటు చేసినందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు.
ఈ మండి జైల్ కాన్సప్ట్ డిజైన్ థీమ్ ప్రత్యేకమని, ఖైదీల వేషదారణలో కారాగారం డైనింగ్ సెటఫ్ లో కూర్చునే ఆహార ప్రియులకు ఫుడ్ సర్వ్ చేస్తారన్నారు.
ప్రాంఛైజి నిర్వహకులు మాట్లాడతూ అరబిక్ థీమ్ ఏర్పాటైన ఈ మండి రెస్టారెంట్ లో ఛెఫ్ లు జూసి మటన్ మండి, అల్ఫాహం మండి ,అరబిక్ ఫిష్ వంటి విభిన్న రకాల రుచులను అందిస్తున్నామని వివరించారు.