ఏపీ సర్కార్ కంటే బ్రిటీష్ వాళ్లే నయం -చంద్రబాబు

జనగ్ కంటే బ్రిటీష్ వాళ్లే నయమని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రోడ్లపై ర్యాలీ, సభలు పెట్టుకునేందుకు అనుమతి లేదని పోలీసులు చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. తన కుప్పం పర్యటన గురించి నెల రోజుల క్రితమే డీజీపీకి లేఖ ఇచ్చామని చెప్పారు. రాష్ట్రంలో జగన్ పని అయిపోయిందని… టీడీపీ సభలకు ప్రజలు పోటెత్తుతున్నారని… అందుకే భయపడి చీకటి జీవో తీసుకొచ్చారని అన్నారు. నిన్న జగన్ సభకు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చి, వాటి బస్సుల్లో జనాలను తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. పెన్షన్ కట్ చేస్తామని బెదిరించి మహిళలను బలవంతంగా తరలించారని చెప్పారు. ఇప్పుడు తన సొంత ఇల్లు కుప్పంకు తనను రానివ్వకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం, పోలీసుల దయాదాక్షిణ్యాలతో టీడీపీ సభలు పెట్టుకోవాలా అని ప్రవ్నించారు. తన ప్రజలతో తాను కలవకూడదా అని మండిపడ్డారు. పోలీసులు కూడా పద్ధతి ప్రకారం వ్యవహరించాలని అన్నారు. జగన్ నియంతగా మారారని… ఆయన పాలన పోవాలని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. ఏ చట్టం ప్రకారం తనను మాట్లాడకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అడిగారు. తన రోడ్ షోకు, సభకు ఎందుకు అనుమతిని ఇవ్వడం లేదో రాసివ్వాలని పోలీసులను అడిగానని… ఇంత వరకు వారి నుంచి స్పందించడం లేదని చెప్పారు. డీజీపీకి చిత్తశుద్ధి ఉంటే బాబాయ్ ని గొడ్డలితో ఎవరు నరికి చంపాలో కనిపెట్టాలని అన్నారు. ఇలాంటి పనికిమాలిన దద్దమ్మ, సైకో సీఎంను తన జీవితంలో తొలిసారి చూస్తున్నానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *