హైదరాబాద్ బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ హోటల్ లో కలర్ ఫుల్ గా సాగిన బ్రైడల్ మేకప్ పోటీలు
మేకప్ రంగంలో ప్రతిభను ప్రోత్సహించేందుకే పోటీలు
హైదరాబాద్:
అందమైన ముద్దుగుమ్మలు బ్రైడల్ వేర్ తో మెరిసిపోయారు . ఎస్ బీ ఇన్నోవేషన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రైడల్స్ మేకప్ కాంపిటీషన్స్ కలర్ ఫుల్ గా సాగాయి .మోడలింగ్ ,మేకప్ , బ్యూటీ, ఫ్యాషన్ రంగాల్లో టాలెంట్ ఉన్న యువతను ఎస్ బీ ఇన్నోవేషన్స్ ద్వారా మంచి అవకాశాలు కల్పిస్తామని నిర్వహఖులు వంశీ కృష్ణ తెలిపారు .
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్ లో SB ఇన్నోవేషన్స్ ఇన్ అసోసియేషన్ విత్ ఇండియన్ బ్యూటీ అసోసియేషన్(IBA), “సౌత్ ఇండియన్ బ్రైడల్ మేకప్ స్టూడియో(SBMS) సంయుక్తంగా బ్రైడల్ మేకప్ పోటీని నిర్వహించాయి. దక్షిణ భారతదేశంలోని బ్యూటీ పార్లర్ల యజమానులు ,మోడల్స్ సుమారు రెండు వందల మంది ఈ పోటీలో పాల్గొన్నారు. పోటీలో పాల్గొన్న వారందరికీ సర్టిఫికేట్లు అందజేశారు. ఇందులో ముగ్గురు విజేతలను ఎంపిక చేశారు. ప్రతిభావంతులైన బ్యూటీషియన్లు ,మోడల్స్ కోసమే ఈ పోటీ నిర్వహించామని సామాజిక వేత్త సుధా జైన్ అన్నారు .
బ్రైడల్ మేకప్ స్టూడియో, ఫోటోగ్రఫీ, బ్యూటీ ,ఫ్యాషన్ కు సంబంధించిన వారందరిని ఒకేఫ్లాట్ ఫాంపైకి తీసుకువచ్చేందుకే ఈ పోటీలు నిర్వహించినట్లు మహేష్ అకాడమి , సెలూన్స్ గ్రూప్ వ్యవస్థాపకులు మహేష్ అన్నారు. సౌత్ ఇండియన్ బ్రైడల్ మేకప్ స్టూడియోతో కలిసి పెళ్లికూతురు మేకప్ పోటీని నిర్వహించామని ఎస్‌బీ ఇన్నోవేషన్స్ ఎండీ వంశీకృష్ణ తెలిపారు .
మోడల్స్ పెళ్లికూతుళ్ల వేషధారణలో కనిపించడం చాలా బాగుందన్నారు . SB ఇన్నోవేషన్స్‌తో యువ మేకప్ ఆర్టిస్ట్‌లు తమ కేరీర్ ను నిర్మించుకునేందుకు సహకరిస్తామన్నారు .