హైదరాబాద్ ఎల్.బి.స్టేడియంలో క్రెసెంట్ క్రికెట్ కప్..

ఫిబ్రవరి 26 బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్

సే నో టూ డ్రగ్స్ పై అవేర్ నెస్ మ్యాచ్
అందరికీ ఉచిత పాస్ ఎంట్రీ

హైదరాబాద్, జనవరి 2023

మహిళా సాధికారత, శిశు సంక్షేమం, రక్త దానాలు వంటి సోషల్ కాజ్‌తో క్రెసెంట్ క్రికెట్ కప్ (CCC) ప్రతి యేడు నిర్వహిస్తున్న సినీ స్టార్స్ క్రికెట్ పోటీలు, ఈ సంవత్సరం సే నో టూ డ్రగ్స్ (SAY No to Drugs) ప్రచారంతో హైదరాబాద్‌లో నిర్వహించనుంది. ఫిబ్రవరి 26న గ్రేటర్ హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో జరుగనున్న ఈ బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ క్రెసెంట్ క్రికెట్ కప్ – డై అండ్ నైట్ టి-20 మ్యాచ్ పోటీల వివరాలను వెల్లడించింది. బంజారాహిల్స్ లోని హయత్ ప్లెస్ లో జరిగిన సమావేశంలో క్రెసెంట్ క్రికెట్ కప్ చైర్మన్ కె ఎం షకీల్ సఫీ సమక్షంలో రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర పశు సంవర్ధక, సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బాలీవుడ్ టీమ్ నుండి క్యాప్టన్ గా వ్వవహరిస్తున్న నటుడు అర్బాజ్ ఖాన్ తో పాటు బిగ్ బాస్ విన్నర్ రేవంత్, ప్లే బ్యాక్ సింగర్ శ్రీరామ చంద్ర, టాలీవుడ్ నటులుల రాజ్ తరుణ్, వి.జే సన్నీ, వరుణ్ సంజేశ్, తనీష్, ఖయ్యుం, రవి ప్రకాష్, సోహెల్, షఫీ అమీత్, శ్రావణ్ రాఘవేంద్ర లు ఈ క్రికెట్ మ్యాచ్ కప్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి హోమ్ మంత్రి మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ కృషికి యువతో అవగాహన కల్పించేందుకు మ్యాచ్ నిర్వహించడం అభినందనీయమని వారు అన్నారు. నటుడు అర్బాబ్ ఖాన్ మాట్లాడుతూ డ్రగ్స్ యువత భవిష్యత్తును కబళించి వేస్తుందన్నారు. దీన్ని నిర్నూలించేందకు ప్రభుత్వం చేస్తున్న క్రుషికి తమ వంత సహాయంగా క్రెసెంట్ క్రికెట్ కప్ సే నో టూ డ్రగ్స్ పై అవేర్ నెస్ తీసువచ్చేందుకు బాలీవుడ్ వర్సెస్ టాలీవు డ్ క్రికెట్ పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు.

క్రెసెంట్ క్రికెట్ కప్ చైర్మన్ కె ఎం షకీల్ సఫీ మాట్లాడుతూ సామాజిక బాధ్యతలో భాగంగా తాము 2011 నుండి భారత దేశంతో పాటు విదేశాలలో సినీ తారల మ్యాచ్‌లను నిర్వహిస్తోందని, హైదరాబాద్ లో ఈ మ్యాచ్ రెండవ సారి జరుగుతుందన్నారు. ఈ మ్యాచ్ పూర్తిగా ఉచితమని, పాస్‌తో మాత్రమే ప్రవేశం ఉంటుందని ప్రకటించారు. సే నో టూ డ్రగ్స్ అవేర్ నెస్ మ్యాచ్ నిర్వహిస్తుమనగానే, (సి.ఎస్.ఆర్ ) కార్పోరేట్ సోషల్ రెస్పాసి బిలిటీ లో భాగంగా మ్యాచ్ కు భాగస్వామిలుగా శ్రీని ఇన్‌ఫ్రా, డెల్ఫీ ఆటోమేషన్, టెక్నో పెయింట్స్, అచీవ్ అకాడమీ , స్క్వే ర్ అండ్ యార్డ్స్ , సి.ఐ.ఎ, అరైవే, మురుగన్ హాస్పిటల్స్, రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ లు స్వచ్ఛందంగా ముందుకు రావడం మరింత ప్రోత్సాహానిచ్చిందన్నారు. అనంతరం రెండు జట్టుల నటీ నటుల సే యస్ టూ లైఫే … నో టూ డ్రగ్స్ అంటూ ప్రమాణం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *