కోనసీమలో సందడి చేసిన బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్
తూర్పు గోదావరి జిల్లా
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ కోనసీమలో సందడి చేశారు. తాజా సినిమా లాల్ సింగ్ చద్దా సినిమా షూటింగ్ తాజాగా తూర్పుగోదావరి షిప్ట్ అయ్యింది. కాకినాడలోని సరోవర్ హోటల్ లో ఆమీర్ ఖాన్ బస చేశారు.
షూటింగ్ నిమిత్తం అల్లవరం మండలం కోడూరుపాడు చేరుకున్న అమీర్ ఖాన్ ను చూడడానికి అభిమానులు ఎగబడ్డారు. అమిర్ ఖాన్ తో ఫోటోలు దిగేందుకు అభిమానుల ఉత్సాహం చూపారు.
ఆమిర్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’ లో నాగచైతన్య కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నాగ చైతన్య ఆర్మీ ఆఫీసర్ గా కనిపించగా ఆమీర్ ఖాన్.. లాల్ సింగ్ పాత్ర పోషిస్తున్నాడు.
ఇప్పటికే కార్గిల్, లడఖ్, శ్రీనగర్ లొకేషన్స్‌లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఈ షెడ్యూల్స్‌లో అమీర్, చైతన్యలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. చిత్రదర్శకుడు అద్వైత్ చందన్. చైకి హిందీలో ఇది తొలి చిత్రం కావడం విశేషం.