హైద‌రాబాద్ జూబ్లీ హిల్స్ లో శ్రిరూప్ హెయిర్ అండ్ బ్యూటీ క్లీనిక్ ను ప్రారంభించిన మిస్ ఇండియా మాన‌స వార‌ణాసి

హైద‌రాబాద్ జూబ్లీ హిల్స్ లో శ్రిరూప్ హెయిర్ అండ్ బ్యూటీ క్లీనిక్ ను ప్రారంభించిన మిస్ ఇండియా మాన‌స వార‌ణాసి

హైద‌రాబాద్ , జూబ్లీహిల్స్

భాగ్య‌న‌గ‌రంలో ఫెమినా మిస్ ఇండియా విన్న‌ర్ మాన‌స వార‌ణాసి సందడి చేసింది .హైద‌రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబ‌ర్ 54 లో శ్రీరూప్ హెయిర్ అండ్ బ్యూటీ క్లీనిక్ ను మిస్ ఇండియా వరల్డ్ 2021 మానస వారణాసి, డాక్టర్ జి. రాజశేఖర్, డాక్టర్ జి.లీల సరస్వతి ప్రారంభించారు. ఈ సందర్భంగా మానస వారణాసి మాట్లాడుతూ.. ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ చర్మ, కేశ సౌందర్యం కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని అన్నారు. అందాల రంగంలో వీటికి చాలా ప్రాముఖ్యత ఉంద‌న్నారు . ఒకప్పుడు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు నగరంలోనే అత్యాధునిక సౌందర్య సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు .అత్యాధునిక సాంకేతిక ప‌రిక‌రాల‌ను ఉప‌యోగించి బ్యూటీ సేవ‌లు అందిస్తున్న‌ట్లు శ్రీ రూప్ ఫౌండ‌ర్ డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ అన్నారు . లైపోసెక్షన్ తో పాటు, శ‌రీరం తెలుపు రంగు వ‌చ్చేలా బ్రెజిలియన్ టెక్నిక్ తో చికిత్స అందుబాటులోకి తీసుకువ‌చ్చామ‌న్నారు .దీంతో పాటు హెయిర్ ట్రాన్స్ ఫ్లాంటేష‌న్ , ఐవి జెన్ FUEవంటి చికిత్స అందిస్తున్నామని అన్నారు. ఇక తాము వాడే ఉత్పత్తులను స్పెయిన్, అమెరికా, థాయిలాండ్, ఆస్ట్రేలియా, బెల్జియం, ఫ్రాన్స్, జపాన్, ఫిలిప్పీన్ నుంచి తెప్పిస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.