నెల్లూరు జిల్లా కందుకూరులో ఘటనలో 8 మంది మృతి చెందడం పట్ల తీవ్ర సంతపం వ్యక్తం చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
దురదృష్ట ఘటన
నెల్లూరుజిల్లా కందుకూరులో బుధవారం సాయంత్రం జరిగిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభలో జరిగిన తొక్కిసలాటలో 8 మంది మరణించడం పట్ల రాష్ట్ర బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు తీవ్ర సంతాప వ్యక్తం చేశారు.

ఈ సంఘటన దురదృష్టకరమైనప్పటికీ సభలు, సమావేశాలు సందర్భంగా రాజకీయ పార్టీలు తగు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా పోలీస్ యంత్రాంగం కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతిపక్ష పార్టీల సభలకు కూడా రీతిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
ఇది రాజకీయ పార్టీ సభ అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరణించిన వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సోము వీర్రాజు విజ్ఞప్తి చేశారు