ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ

హైదరాబాద్

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ కు తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు.సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవం నాడు రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని లేఖలో కోరారు.హైదరాబాద్ లో
తెలంగాణ విమోచన స్ఫూర్తి కేంద్రం నిర్మాణానికి స్థలం కేటాయించాలని..కేంద్ర ప్రభుత్వం అందించనున్న ఆర్థిక సహాయంతో వాటి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.తెలంగాణ విమోచన స్ఫూర్తి కేంద్రాన్ని యుద్ధ ప్రాతిపదికన 2022 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.తెలంగాణ విమోచన ఉద్యమం సందర్భంగా రజాకార్ల చేతిలో బలైన వారి కుటుంబాలను అధికారికంగా ప్రభుత్వం సన్మానం చేయాలి, వారిని ఆదుకోవాలని లేఖలో పేర్కొన్నారు.తెలంగాణ విమోచన పోరాట చరిత్రను, ఆ ఉద్యమంలో పాల్గొన్న మహనీయుల చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలన్నారు.

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఆ ఉద్యమంలో పాల్గొన్న వారిని సత్కరించాలని డిమాండ్ చేశారు.రజాకార్లను తరిమి కొట్టిన వీరబైరాన్‌పల్లి, వరంగల్ కోట, రేణికుంట, కడవెండి, కామారెడ్డిగూడెం, పర్కాల, సూర్యాపేట, బీబీ నగర్, బాలెంల – పెరుమాండ్ల సంకీస తదితర ప్రాంతాలతో పాటు, తెలంగాణ విమోచనోద్యమ ఘట్టాలను పరిరక్షించాలని లేఖలో బండి సంజయ్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *