ప్రతి ఒక్కరూ సేవ భావాన్ని పెంపొందించుకోవాలి : బీజేపీ జాతీయ నాయకులు మురళీధర్ రావు

పుట్టిన రోజు వేడుకలను వయో వృద్ధులతో కలిసి జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మియపూర్ ఓల్డ్ఏజ్ వెల్ఫేర్ సెంటర్ లో బీజేపీ జాతీయ నాయకులు మురళీధర్ రావు జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఆశ్రమం లోని వయో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మురళీ ధర్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవ భవాని పెంపొందించుకోవాలి అని అన్నారు. సంపాదించిన ఆస్తిలో కొంత సామాజిక సేవ కార్యక్రమాలు ఉపయోగించాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గారి చూపిన బాటలో ప్రతి ఒక్కరూ సేవ కార్యక్రమంలో మనమందరం ముందుండి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పని చేయాలని అన్నారు.అలాగే పలు ప్రాంతాల్లో రక్త దాన కార్యక్రమం,ఉచిత వైద్య శిబిరం,చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు

.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు జ్ఞానేంద్ర ప్రసాద్, యోగానంద్ , మియాపూర్,హఫీజ్ పెట్ డివిజన్ డివిజన్ అధ్యక్షులు మణిక్ రావు, శ్రీధర్ రావు, సీనియర్ నాయకులు లక్ష్మణ్, రామకృష్ణ, విజేందర్, రత్న కుమార్,ప్రభాకర్, గణేష్, వినోద్, నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *