హైదరాబాద్‌లో మొట్టమొదటి  వాక్‌ ఇన్‌ స్టోర్‌ను ప్రారంభించిన టాటా ఎంటర్‌ప్రైజెస్‌ బిగ్‌బాస్కెట్‌

పండ్లు, కూరగాయలు కాకుండా 4000కు పైగా ఉత్పత్తి విభాగాలు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి

హైదరాబాద్‌, 28 డిసెంబర్‌ 2022

టాటా ఎంటర్‌ప్రైజస్‌, బిగ్‌బాస్కెట్‌ తమ మొట్టమొదటి వాక్‌ ఇన్‌  స్టోర్‌ను హైదరాబాద్‌ ప్రారంభించింది.  ఈ సెల్ఫ్‌ సర్వీస్‌ స్టోర్‌లో వినియోగదారులు ఎంచుకునేందుకు 4వేలకు పైగా ఉత్పత్తి విభాగాలు అందుబాటులో ఉంచారు.  వీటిలో వ్యక్తిగత సంరక్షణ,  బ్రాండెడ్‌ ఫుడ్స్‌, బేవరేజస్‌, కిచెన్‌వేర్‌, బేబీకేర్‌తోపాటుగా  పండ్లు, కూరగాయలు, గ్రోసరీ  ఐటంలు అందుబాటులో ఉంచినట్లు బిగ్ బాస్కెట్ కో ఫౌండర్ వీఎస్ సుధాకర్ తెలిపారు.

హైదరాబాద్ మణికొండలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్ ను బాస్కెట్ కో ఫౌండర్ వీఎస్ సుధాకర్,పూర్వ సభ్యులు బొల్లిపల్లి నగేష్‌ , గువ్వ కుమార్‌ కలిసి ప్రారంభించారు.  దాదాపు ఐదు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ స్టోర్ ఏర్పాటు చేసినట్లు సుధాకర్ వెల్లడించారు. రైతుల నుంచి నేరుగా సేకరించిన కూరగాయాలను ఈ స్టోర్ లో అందుబాటులో ఉంచామన్నారు .  

బిగ్ బాస్కెట్ యాప్ ద్వారా  ఆన్ లైన్ లో అన్ని రకాల ఉత్పత్తులను అందించామన్నారు .  ఇప్పుడు ఆఫ్‌లైన్‌ స్టోర్లలో ప్రవేశించడం ద్వారా   మరింతగా వినియోగదారులకు చేరువ అవుతామని ఆశాభావం వ్యక్తం చేశారు . అత్యున్నత నాణ్యత కలిగిన ఉత్పత్తులను సరసమైన ధరలలో అందిస్తున్నట్లు సుధాకర్ తెలిపారు .హైదరాబాద్ లో మొట్టమొదటి స్టోర్ ను ప్రారంభించామని …త్వరలో దేశ వ్యాప్తంగా అన్ని నగరాల్లో స్టోర్లు ప్రారంభించనున్నట్లు బిగ్ బాస్కెట్ కో ఫౌండర్ సుధాకర్ తెలిపారు.  

పర్యావరణ పరిరక్షణలో భాగంగా  పండ్లు ,కూరగాయలకు నో ఫ్లాస్టిక్ ప్యాకేజింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. సూపర్ మార్కెట్లకు ధీటుగా బిగ్ బాస్కెట్ స్టోర్ లను తీర్చిదిద్దుతామన్నారు.   స్థానిక మార్కెట్‌లతో  పోలిస్తే అతి తక్కువ ధరలకు వస్తువులను అందించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు .  ఈ డిజిటల్‌ ఆధారిత ఔట్‌లెట్‌లో  వినియోగదారుల సౌకర్యార్ధం సెల్ఫ్‌, అసిస్టెడ్‌ బిల్లింగ్‌ కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. . వినియోగదారులు తామెంచుకున్న ఉత్పత్తులను బిల్లింగ్‌ కౌంటర్‌ వద్ద  స్కాన్‌ చేసుకుని ఆన్‌లైన్‌ చెల్లింపులు సైతం చేయవచ్చు.

బిగ్‌బాస్కెట్‌ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 400 పట్టణాలు, నగరాలలో కార్యకలాపాలు నిర్వహిస్తుందని…. నెలకు 15 మిలియన్‌లకు పైగా వినియోగదారుల ఆర్డర్లను డెలివరీ చేస్తుందన్నారు . ఈ కంపెనీ ప్రస్తుత ఆదాయం 1.2 బిలియన్‌ డాలర్లుగా ఉందని సుధాకర్ తెలిపారు ..   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *