75వ స్వాతంత్య్ర దినోత్సవంను పురస్కరించుకుని జాతీయ జెండాలో స్వాతంత్ర్య పోరాట చిత్రాన్ని గీసి అద్భుతంగా వర్ణించాడు భేల్ జెడ్.పి.ఎచ్.ఎస్ విద్యార్థి చిట్ల కార్తీక్

స్వాతంత్ర దినోత్సవం రోజున  గుండెనిండా దేశ భక్తి,. అప్పటి మహానీయుల త్యాగాలకు గుర్తు చేస్తూ చిట్ల కార్తీక్ వేసిన చిత్రాలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. కరోనాపై పోరాటం చేసిన వైద్యులు, నర్సులు ,పోలీసులు,పారిశుద్ద్యకార్మికులు, స్వచ్చంధ సంస్థలు,  మీడియా చేసిన సేవలను గుర్తించి వారికి తన చిత్రపటంలో స్థానం కల్పించారు. ప్రధాని మోడీ జాతీయ పతాకంకు సెల్యూట్ చేస్తున్నట్లు గీసిన చిత్రం ఎంతగానో ఆకట్టుకుంటుంది. బార్డర్ లో కార్గిల్ వార్ జరిగిన తీరు కళ్ళకు కట్టినట్లుగా ఈ చిత్రంలో చూపించారు. చేనేతను ప్రొత్సహించేలా రాట్నంను , ఇండియా మ్యాప్ ను, స్వాతంత్ర్య పోరాటంలో ముందుండి నడిపించిన గాంధీ ,నెహ్రు, ఇతర నాయకులు చిత్రాలతో కూడిన చిత్రపటం ఆకర్షిస్తోంది.

మేకిన్ ఇండియా ,మేడిన్ ఇండియా పేరుతో  రూపొందించిన సింహం చిత్రపటాన్ని కార్తీక్ చిట్ల తన ఆర్ట్ లో పొందుపర్చారు.

స్వాసంత్ర్య ఉద్యమం నుంచి   ఇప్పటి 2021 భారత దేశం ఎదుర్కొన్న పరిస్థితిని  మన జాతీయ జండాపై అద్భుతంగా గీసి పలువుర్ని ఆకట్టుకునాడు  చిట్ల కార్తీక్.

సంగారెడ్డి జిల్లా బీహెచ్ ఈఎల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  పదవ తరగతి చదువుతున్న చిట్ల కార్తీక్ గీసిన  ఆర్ట్ ను చూసి పలువురు అభినందనలు తెలిపారు.

పెన్సిల్ పోర్ట్రైట్  ఆర్ట్ తో ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రిపై ప్రేమతో 67 వ పుట్టినరోజు సందర్భంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  చిత్రం గీసి జన్మదిన రోజున బహుమానంగా ప్రదర్శించాడు. అలాగే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజు సందర్భంగా ఆమె  చిత్రం గీసి  పలువుర్ని ఆకర్శించాడు కార్తిక్.

2020 లో లాక్ డౌన్ విధించినప్పటి నుండి, తన అన్నయ్య చిట్ల కుందన్ , కార్తీక్ ఇద్దరూ ఫ్రంట్ లైన్ యోధులైన  పోలీసులు, డాక్టర్, నర్సు, జర్నలిస్టులు, జీహెచ్ఎంసీ , ఇతరులను పెన్సిల్ ఆర్ట్స్ వేసారు. ఇద్దరు కళాకారులు తన పెద్ద అన్న శ్రీనాథ్ ప్రేరణతో 2013 నుండి పెయింటింగ్ చేయడం ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *